ఫేక్ ఆధార్, పాన్తో రిటైర్డ్ సైంటిస్ట్ జాగా కబ్జా.. రంగారెడ్డి జిల్లా నాదర్గుల్ లో ఘటన

ఫేక్ ఆధార్, పాన్తో రిటైర్డ్ సైంటిస్ట్ జాగా కబ్జా.. రంగారెడ్డి జిల్లా నాదర్గుల్ లో ఘటన

ఇబ్రహీంపట్నం, వెలుగు: డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ లాబొరేటరీ రిటైర్డ్​సైంటిస్ట్​ ప్లాట్‌‌ను కొందరు నకిలీ ఆధార్ కార్డు సృష్టించి, ఫోర్జరీ రిజిస్ట్రేషన్లతో కబ్జా చేశారు. బెంగళూరులో ఉంటున్న మాజీ​రిటైర్డ్​సైంటిస్ట్ ఆర్.తంగరాజ్ (67) రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్‌‌గుల్ లో 1984లో 300 చదరపు గజాల ప్లాట్​కొన్నాడు. 

రిటైర్డ్​అయిన తర్వాత అనారోగ్యంతో బెంగళూరులో ఉంటుండడంతో హైదరాబాద్ రాలేకపోయాడు. దీన్ని ఆసరాగా చేసుకుని ఓ గుర్తు తెలియని వ్యక్తి తంగరాజ్ పేరుతో నకిలీ ఆధార్ కార్డు, తప్పుడు వయస్సు (56 ఏళ్లు), నకిలీ పాన్ నంబర్ సృష్టించాడు. 

బంటు పుష్ప, నెనావత్ బుజ్జి, శ్యామల యాదయ్యలతో కలిసి ప్లాట్‌‌ను రిజిస్ట్రేషన్​చేయించుకుని వేరే వారి పేర్లమీదకి మార్చేశారు. ఆ స్థలంలో నిర్మాణ పనులు చేసేందుకు సామాగ్రిని కూడా తరలించాడు. ఆన్‌‌లైన్ లో ఎన్‌‌కంబరెన్స్ సర్టిఫికేట్ (ఈసీ) చూసి మోసాన్ని గుర్తించిన బాధితుడు ఆదిభట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ రమేశ్​తెలిపారు.