బంగాళాఖాతంలో రెండు పడవలు బోల్తా..500 మందికిపైగా రోహింగ్యాలు మృతి! 

బంగాళాఖాతంలో రెండు పడవలు బోల్తా..500 మందికిపైగా రోహింగ్యాలు మృతి! 

యాంగోన్: రోహింగ్యాలు ప్రయాణిస్తున్న రెండు పడవలు బంగాళాఖాతంలో మునిగిపోయాయి. ఈ ఘటనలో 500 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తున్నది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ వలసల సంస్థ (ఐఓఎమ్), శరణార్థుల ఉన్నత కమిషనర్ కార్యాలయం (యూఎన్​హెచ్​సీఆర్) గురువారం వెల్లడించాయి. జూన్ చివరలో మయన్మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని రఖైన్ రాష్ట్రం నుంచి రెండు పడవలు బయలుదేరాయి.

వీటిలో ఎక్కువ మంది రోహింగ్యాలు ఉండగా, బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని శరణార్థి శిబిరాల నుంచి వచ్చినవారూ ఉన్నారు. సుమారు 250 మంది ప్రయాణిస్తున్న తొలి పడవ బయలుదేరిన కొద్దిసేపటికే అదృశ్యమైంది. మరో 280 మంది ఉన్న రెండో పడవ జూలై 8న మయన్మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అయేయర్వాడి తీరానికి సమీపంలో మునిగిపోయినట్లు సమాచారం. ఈ రెండు ఘటనల్లో మరణాల సంఖ్యను అధికారికంగా నిర్ధారించనప్పటికీ, భారీ ప్రాణనష్టం ఉండొచ్చని ఐఓఎమ్, యూఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఆర్ తెలిపాయి.