హైదరాబాద్: 2004 సెప్టెంబర్ 1కు ముందు జారీ చేసిన నోటిఫికేషన్ల ద్వారా నియమితులైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని గ్రూప్–1 ఆఫీసర్స్ అసోసియేషన్ సీఎస్ సంజయ్ జాజును కోరింది. గురువారం సచివాలయంలో అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సీఎస్‌ను కలిసి వినతిపత్రం అందజేసింది.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ తరహా ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని, తెలంగాణ హైకోర్టు సైతం ఓపీఎస్ పునరుద్ధరణకు అనుకూలంగా ఆదేశాలు ఇచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో గ్రూప్–1, గ్రూప్–2, డీఎస్సీ, ఎస్సై, కానిస్టేబుల్ తదితర విభాగాలకు చెందిన సుమారు 11 వేల మంది ఉద్యోగులు ఈ నిర్ణయంతో లబ్ధి పొందుతారని తెలిపారు.
