హైదరాబాద్, వెలుగు: వరల్డ్ మిఠాయి అండ్ నమ్కీన్ కన్వెన్షన్ హైదరాబాద్‌లోని హైటెక్స్లో గురువారం ప్రారంభమైంది. ఈ నెల 18 వరకు కొనసాగుతుంది. మిఠాయి, నమ్కీన్, బేకరీ రంగాలకు చెందిన ముడి పదార్థాలు, ప్యాకేజింగ్ యంత్రాలు, ఆటోమేషన్ టెక్నాలజీలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. స్వీట్ల నిల్వసామర్థ్యాన్ని పెంచడం, ప్రీమియం గిఫ్టింగ్ సొల్యూషన్స్ పై నిపుణులతో నాలెడ్జ్ సెషన్స్ నిర్వహిస్తున్నారు. అమూల్, హల్దీరామ్స్, పిస్తా హౌస్, కరాచీ బేకరీ సహా పలు ప్రముఖ సంస్థలు ఇందులో పాల్గొంటున్నాయి. 300 పైగా స్టాళ్లతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను 30 వేలకుపైగా వ్యాపార సందర్శకులు వస్తారని అంచనా. చివరి రోజున ఫ్యాక్టరీ విజిట్స్ఉంటాయి.
