పీఆర్సీ రిపోర్టు తెప్పించి.. అమలు చేయండి..మంత్రి శ్రీధర్ బాబుకు పెన్షనర్ల సంఘం వినతి

పీఆర్సీ రిపోర్టు తెప్పించి.. అమలు చేయండి..మంత్రి శ్రీధర్ బాబుకు పెన్షనర్ల సంఘం వినతి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పేరి వెంకట్ రెడ్డి కోరారు. పీఆర్సీ అమలులో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలని విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన సెక్రటేరియెట్ లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డితో పాటు సంఘం నేతలతో కలిశారు. ఈ సందర్భంగా పెన్షనర్ల డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మంత్రికి అందజేశారు.

జులై 1, 2023 నుంచి రాష్ట్రంలో కొత్త పీఆర్సీ అమలు కావాల్సి ఉన్నా, ఇప్పటికీ నివేదిక రాకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. పీఆర్సీ కమిషనర్ నుంచి రిపోర్టును వెంటనే తెప్పించుకుని, ఆలస్యం లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2023 నుంచి పెండింగ్‌‌లో ఉన్న పీఆర్సీ బకాయిలను విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు శ్రీనివాస్ రెడ్డి, కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ ఎ. మోహన్ శర్మ  పాల్గొన్నారు.