పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి : జిల్లా ప్రధాన కార్యదర్శి కాయిత వీరయ్య

పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి : జిల్లా ప్రధాన కార్యదర్శి కాయిత వీరయ్య

తొర్రూరు, వెలుగు:  పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాయిత వీరయ్య డిమాండ్ చేశారు. గురువారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్​కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్‌‌‌‌‌‌‌‌లో ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షనర్లకు ఈహెచ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పథకం అమలులో లేదన్నారు. 

ఉమ్మడి ఏపీలో ఈ పథకం ప్రారంభమైనప్పటికి తెలంగాణలో ఇప్పటికీ అమలు చేయడం లేదన్నారు. పెన్షనర్లకు రావల్సిన డీఆర్‌‌‌‌‌‌‌‌(డేర్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ రిలీఫ్‌‌‌‌‌‌‌‌) బకాయిలు చెల్లించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. కార్యక్రమంలో సంఘ ప్రధాన కార్యదర్శి,రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కంచర్ల వెంకటాచారి, ట్రెజరర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తుమ్మ నాగేశ్వర్, జిల్లా ఉపాధ్యక్షుడు నారాయణ, తొర్రూరు యూనిట్ ఉపాధ్యక్షులు భిక్షాజీ, పెన్షనర్లు  పాల్గొన్నారు.