బోనాల జాతర .. అమ్మవారికి కుమ్మరుల తొలి బోనం సమర్పణ

బోనాల జాతర .. అమ్మవారికి  కుమ్మరుల తొలి బోనం సమర్పణ

లోయర్ ట్యాంక్‌‌ బండ్ వద్ద గురువారం తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం ఆధ్వర్యంలో కుమ్మరుల తొలి బోనం జాతర భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో కుమ్మర సంఘం నాయకులు, మహిళలు, యువత తరలివచ్చారు. 

మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఎంపీ ఆర్.కృష్ణయ్య, ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేషన్ చైర్మన్​మెట్టు సాయికుమార్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ సీనియర్ నాయకుడు ఎం ఎన్  శ్రీనివాస్ రావు, తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం అధ్యక్షుడు నడికుడ జయంత్ రావు, కుమ్మర్ల బోనాల ఉత్సవ కమిటీ కన్వీనర్ ఆడాల గణేశ్​ తదితరులు పాల్గొన్నారు. -