‘సర్’లో సమస్యలు వస్తే చెప్పండి : కలెక్టర్ ఖుష్బూ గుప్తా

‘సర్’లో సమస్యలు వస్తే చెప్పండి : కలెక్టర్ ఖుష్బూ గుప్తా

 మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: మహబూబ్‌‌‌‌నగర్ జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ నిర్వహణలో ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే అధికారుల దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని కలెక్టర్ ఖుష్బూ గుప్తా హామీ ఇచ్చారు. గురువారం కలెక్టరేట్‌‌‌‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు.

భారత ఎన్నికల సంఘం సర్​ప్రక్రియ గడువును పొడిగించిందని, బీఎల్‌‌‌‌ఓల ఇంటింటి సర్వే గడువును ఆగస్టు 3 వరకు, పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ ప్రక్రియను కూడా ఆగస్టు 3 వరకు పొడిగించినట్లు వెల్లడించారు. మహబూబ్‌‌‌‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటివరకు 57.05 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని తెలిపారు.  

పట్టణ ప్రాంతాల్లో సర్​పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు మున్సిపల్ చెత్త సేకరణ వాహనాల ద్వారా ఆడియో ప్రచారం నిర్వహించాలన్న పార్టీల ప్రతినిధుల సూచనపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో  అడిషనల్ కలెక్టర్లు మధుసూదన్ నాయక్,  జేఎల్​బీ హరిప్రియ, ఆర్డీఓ నవీన్, అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.