సీఎంసీలో జులై 18న దివ్య వ్యర్థాల సేకరణ..పూజా సామగ్రి, పూలు సేకరించి పర్యావరణహిత పద్ధతుల్లో రీసైక్లింగ్

సీఎంసీలో జులై 18న దివ్య వ్యర్థాల సేకరణ..పూజా సామగ్రి, పూలు సేకరించి పర్యావరణహిత పద్ధతుల్లో రీసైక్లింగ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: సీఎంసీ పరిధిలో శనివారం ఐదు ప్రాంతాల్లో ఉదయం 8.30 గంటల నుంచి 11 గంటల వరకు దివ్య వ్యర్థాల సేకరణ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. 

ఆలయాల్లో పూజల తర్వాత పడేసే పూజా సామగ్రి, పూలు సేకరించి పర్యావరణహిత పద్ధతుల్లో రీసైక్లింగ్ చేయడమే దీని ఉద్దేశం. కొండాపూర్ వైట్‌‌‌‌ఫీల్డ్స్‌‌‌‌లోని సీతారామాంజనేయ స్వామి దేవాలయం, నిజాంపేట్ సెవెన్ హిల్స్ రోడ్డులోని శ్రీవేంకటేశ్వర స్వామి టెంపుల్, కొంపల్లి సర్కిల్‌‌‌‌లోని శివాలయం, ప్రగతి నగర్ పికాక్ జంక్షన్ సమీపంలోని సాయిబాబా దేవాలయం, మేడ్చల్ రైల్వే అండర్‌‌‌‌పాస్ సమీపంలోని శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయాల్లో ఈ ప్రోగ్రాం నిర్వహించనున్నారు.