ఆసియా అండర్‌ 23 బాక్సింగ్ ఛాంపియన్‎షిప్‎లో విశ్వనాథ్‌‌కు స్వర్ణం

ఆసియా అండర్‌ 23 బాక్సింగ్ ఛాంపియన్‎షిప్‎లో విశ్వనాథ్‌‌కు స్వర్ణం

జకర్తా: ఆసియా అండర్‌‌–19, 23 చాంపియన్‌‌షిప్‌‌లో ఇండియా బాక్సర్ల పంచ్‌‌ అదిరింది. అండర్‌‌–23లో భాగంగా గురువారం జరిగిన మెన్స్‌‌ 50 కేజీ ఫైనల్లో విశ్వనాథ్‌‌ సురేశ్‌‌ 3–2తో దైచీ ఇవాయ్‌‌ (జపాన్‌‌)పై గెలిచి గోల్డ్‌‌ మెడల్‌‌ను సాధించాడు. 55 కేజీల బౌట్‌‌లోనూ గంగ 3–2తో బెక్సులాత్‌‌ బొరాన్‌‌బెక్‌‌ (కజకిస్తాన్‌‌)ను ఓడించి స్వర్ణం నెగ్గాడు. 65 కేజీల్లో వంశజ్‌‌ 1–4తో ఇల్ఖోమ్‌‌జోన్‌‌ ఎర్గాషెవ్‌‌ (ఉజ్బెకిస్తాన్‌‌) చేతిలో ఓడి సిల్వర్‌‌తో సరిపెట్టుకున్నాడు. అండర్‌‌–19లో భాగంగా జరిగిన 55 కేజీల్లో ఆదిత్య 0–5తో ఎల్యోర్‌‌ రుస్తమోవ్‌‌ (ఉజ్బెకిస్తాన్‌‌) చేతిలో, 90 కేజీల్లో శుభమ్‌‌ రాజ్‌‌పుత్‌‌ 0–5తో అసద్‌‌బెక్‌‌ సుల్తాన్‌‌బోయెవ్‌‌ (ఉజ్బెకిస్తాన్‌‌) చేతిలో ఓడి రజత పతకాలతో సంతృప్తి పడ్డారు.