గాలె: ఇండియా, శ్రీలంక అండర్–19 జట్ల మధ్య జరిగిన యూత్ టెస్ట్ డ్రాగా ముగిసింది. ఓపెనర్ లక్ష్య రాయ్ చందానీ (207) డబుల్ సెంచరీకి తోడు మానవ్ కృష్ణ (100) సెంచరీ సాధించడంతో.. 378/3 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం నాలుగో రోజు ఆట కొనసాగించిన ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 173.5 ఓవర్లలో 576 రన్స్‌కు ఆలౌటైంది. కుష్ పటేల్ (42), బీకే కిశోర్ (23) ఓ మాదిరిగా ఆడారు. లతేంద్ర ఆకాశ్ 3, కవిజా గమాగే, దిమిత్ అభ్యసింగే చెరో రెండు వికెట్లు పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన లంక రెండో ఇన్నింగ్స్‌ను 39.1 ఓవర్లలో 178/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. దుల్నిత్ సిగేరా (72), కవిజా గమాగే (51) హాఫ్ సెంచరీలతో రాణించారు. స్పిన్నర్ యశ్‌వర్ధన్ సింగ్ చౌహాన్ 4 వికెట్లు తీశాడు. ఇరుజట్ల మధ్య రెండో టెస్ట్ ఈ నెల 20 నుంచి కొలంబోలో జరుగుతుంది.
