న్యూఢిల్లీ : హెచ్‌సీఎల్ టెక్ అమెరికాకు చెందిన గార్డియన్ లైఫ్ ఇన్సూరెన్స్ సబ్సిడరీ గార్డియన్ ఇండియా ఆపరేషన్స్‌ను కొనుగోలు చేయనుంది. ఈ డీల్ విలువ 10.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 101 కోట్లు). ఈ కొనుగోలు ద్వారా గార్డియన్ ఇండియా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌లో ఉన్న దాదాపు 2 వేల మంది ఉద్యోగులు హెచ్‌సీఎల్ టెక్‌లోకి బదిలీ కానున్నారు.
ఈ కొనుగోలుతో పాటు గార్డియన్ లైఫ్ ఇన్సూరెన్స్‌తో హెచ్‌సీఎల్ టెక్ ఏడేళ్ల పాటు సుదీర్ఘ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ అమెరికన్ కంపెనీ ప్రొడక్టులలో టెక్నాలజీ ఇన్నోవేషన్స్, ఆపరేషనల్ ట్రాన్స్‌ఫార్మేషన్ కోసం హెచ్‌సీఎల్ టెక్ ఒక బిజినెస్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది.
