పర్వతగిరి, వెలుగు: వరంగల్ జిల్లా పర్వతగిరి పట్టణ కేంద్రానికి చెందిన విశ్వజెనిత్స్కూల్ కరస్పాండెంట్ ఎర్రబెల్లి హరికుమార్ ఈనెల 7న రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అతనితో కలిసి 1999-–2000లో టెన్త్ చదువుకున్న ఫ్రెండ్స్ అండగా నిలిచారు. అతని కుమార్తె ఆధ్యశ్రీ భవిష్యత్ కోసం పోస్టల్ అకౌంట్‌లో రూ. లక్ష ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు.
ఆ డిపాజిట్ పత్రాలను గురువారం హరికుమార్ దశదినకర్మ వేడుకలకు హాజరై కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం బాధిత కుటుంబసభ్యులను నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పరామర్శించారు.
