లష్కర్ బోనాలకు సీఎంకు ఆహ్వానం

లష్కర్ బోనాలకు సీఎంకు ఆహ్వానం

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ లష్కర్ బోనాలకు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆహ్వానించారు. గురువారం మంత్రి సురేఖ, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, ఆలయ కార్యనిర్వహణాధికారి మనోహర్ రెడ్డితో పాటు ఆలయ ప్రధాన అర్చకులు సీఎంను కలిశారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వేదాశీర్వచనం అందించి, అమ్మవారి శేషవస్త్రాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆషాఢమాస బోనాల పండుగను పురస్కరించుకుని శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానానికి రావాలని సీఎంకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ లష్కర్ బోనాల జాతర మహోత్సవంలో పాల్గొని, అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిం చాలని వారు సీఎంను కోరారు.