గ్రేటర్ వరంగల్, వెలుగు: క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, పట్టుదలతో విజయం కోసం పోరాడాలని ఎన్పీడీసీఎల్ డైరెక్టర్(ఫైనాన్స్) వి.తిరుపతి రెడ్డి సూచించారు. గురువారం హన్మకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో స్పోర్ట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ ట్రాన్స్‌కో, ఎన్‌పీడీసీఎల్,ఎస్‌పీడీసీఎల్ ఆధ్వర్యంలో ఇంటర్ సర్కిల్ వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్ , క్యారమ్స్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి క్రీడలను ఎంతో ప్రోత్సహిస్తున్నారని అన్నారు.
నిరంతరం ఒత్తిడితో పనిచేసే ఉద్యోగులకు ఇలాంటి క్రీడాపోటీలు ఉపశమనం కలిగిస్తాయన్నారు. క్రీడలతో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ హెచ్‌ఆర్‌డీ సి.ప్రభాకర్, చీఫ్ ఇంజినీర్ రాజుచౌహన్ , సీజిఎం వేణు బాబు, సూపరింటెండింగ్ ఇంజినీర్ ఆపరేషన్ బి.సామ్య నాయక్, ఎస్‌ఈలు ఎ.ఆనందం, సీహెచ్ సంపత్ రెడ్డి, పి.విజయేందర్‌రెడ్డి, ఎ.రమేశ్, బి.భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు .
