బుల్డోజర్‌‌ న్యాయంపై పిటిషన్లు హైకోర్టులకు బదిలీ.. ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీంకోర్టు

బుల్డోజర్‌‌ న్యాయంపై పిటిషన్లు  హైకోర్టులకు బదిలీ..  ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ‘బుల్డోజర్‌‌ న్యాయం’ ఆరోపణలకు సంబంధించిన ధిక్కార పిటిషన్లను సంబంధిత రాష్ట్రాల హైకోర్టులకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి కేసులో ప్రత్యేక విచారణ అవసరమవుతుందని, ఆ పిటిషన్లను నేరుగా సుప్రీంకోర్టు విచారించడం సాధ్యం కాదని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌‌ బెంచ్ పేర్కొంది.

2024 నవంబరులో సుప్రీంకోర్టు అక్రమ కూల్చివేతలను చట్టవిరుద్ధమని ప్రకటిస్తూ, సహజ న్యాయ సూత్రాలు, విధి విధానాలు పాటించకుండా ఇళ్లను కూల్చడం అధికార దుర్వినియోగమని స్పష్టం చేసింది. ఆయా  కేసుల్లో వాస్తవ వివాదాలు ఉన్నందున హైకోర్టులే సమగ్రంగా విచారించేందుకు అనుకూలమని బెంచ్ అభిప్రాయపడింది.