హార్మూజ్ జలసంధి మీదుగా ప్రయాణించే నౌకల్లో భారతీయుల్ని నియమించొద్దు: కేంద్రం

హార్మూజ్ జలసంధి మీదుగా ప్రయాణించే నౌకల్లో భారతీయుల్ని నియమించొద్దు: కేంద్రం

న్యూఢిల్లీ: హార్మూజ్ జలసంధి మీదుగా ప్రయాణించే నౌకల్లో భారతీయ నావికులను నియమించొద్దని షిప్ ఓనర్లు, మేనేజర్లు, కంపెనీలను భారత ప్రభుత్వం ఆదేశించింది. జలసంధిలో నౌకలపై జరిగిన దాడుల్లో ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోవడంతో కేంద్రం కీలక అడ్వైజరీ జారీ చేసింది. ఈ మేరకు బుధవారం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మారిటైమ్ అడ్మినిస్ట్రేషన్ ‘ఎక్స్’లో  పోస్ట్ పెట్టింది. ‘‘తదుపరి ఆదేశాలు వచ్చే వరకు హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల్లో భారతీయ నావికులను నియమించొద్దు. నావిగేషనల్ హెచ్చరికలను  కూడా నిరంతరం గమనించాలి” అని కోరింది.