హైదరాబాద్, వెలుగు: కార్పొరేట్ విద్యా సంస్థల కంటే ప్రభుత్వ గురుకులాల్లోనే మెరుగైన ఫలితాలు వస్తున్నాయని ఎంపీ ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. గత విద్యా సంవత్సరంలో బీసీ గురుకులంలో 99 శాతం ఉత్తీర్ణత సాధించడంతో తల్లిదండ్రులు పిల్లలను గురుకులలోనే చేర్పించేందుకు పోటీ పడుతున్నారని తెలిపారు.
గురువారం హైదరాబాద్ మసాబ్ ట్యాంక్ సంక్షేమ భవన్ లో బీసీ గురుకుల సెక్రటరీ ఆఫీస్‌కు సీట్ల కోసం వచ్చిన స్టూడెంట్స్, పేరెంట్స్‌తో మాట్లాడారు. వారితో కలిసి ఆందోళన చేపట్టారు.
