బీఆర్‍ఎస్‍ వల్లే మామునూర్‍ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టు : మాజీ ఎమ్మెల్యేలు దాస్యం, అరూరి, నరేందర్‍

బీఆర్‍ఎస్‍ వల్లే మామునూర్‍ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టు : మాజీ ఎమ్మెల్యేలు దాస్యం, అరూరి, నరేందర్‍

వరంగల్‍, వెలుగు: బీఆర్‍ఎస్‍ ప్రభుత్వ కృషి వల్లే మామునూర్‍ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్ వచ్చిందని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌‌‌‌‌‌‌‌భాస్కర్‍, అరూరి రమేశ్‍, నన్నపనేని నరేందర్‍ అన్నారు. గురువారం హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో ప్రెస్‍మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్‍ మామునూర్‍ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టు అంశంపై అనేకసార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిశారని, ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ అథారిటీ ఆఫ్‍ ఇండియా, జీఎంఆర్‍ సంస్థతో మాట్లాడినట్లు చెప్పారు. బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ హయాంలో జరిగిన అభివృద్ధిని కాంగ్రెస్‍  నేతలు తమదిగా చెప్పుకుంటున్నారన్నారు. 

తాము అధికారంలో ఉన్నప్పుడే 253 ఎకరాల భూసేకరణకు కేబినేట్‌‌‌‌‌‌‌‌ ఆమోదం ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ భూసేకరణ అంశంలో బీఆర్‍ఎస్‍ ప్రభుత్వం స్పందించలేదని.. సీఎం రేవంత్‍రెడ్డి రికార్డు స్థాయిలో భూసేకరణ చేయించారన్న కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‍ నాయుడు వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యేలు  తెలిపారు.