హైదరాబాద్ లో బోనాల సంబురం .. ఊరూవాడ మురువంగ.. బోనమెత్తె గోల్కొండ

హైదరాబాద్ లో బోనాల సంబురం ..  ఊరూవాడ మురువంగ.. బోనమెత్తె గోల్కొండ

ఆషాఢ మాస బోనాల సంబురం భాగ్యనగరంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. చారిత్రాత్మక గోల్కొండ కోటపై కొలువైన జగదాంబిక మహంకాళి అమ్మవారికి కుమ్మరులు తొలి బోనం సమర్పించడంతో వేడుకలు అధికారికంగా మొదలయ్యాయి. 

లంగర్ హౌస్ నుంచి గోల్కొండ కోట వరకు నిర్వహించిన ఘటాలు, తొట్టెల ఊరేగింపు ఆధ్యాత్మిక  శోభను తీసుకువచ్చింది. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో గోల్కొండ కోట దద్దరిల్లింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు, బంగారు బోనాన్ని సమర్పించారు. భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.