ఎయిర్‌టెల్ యాడ్కోసం ఏఆర్ రెహమాన్ రూపొందించిన సిగ్నేచర్ ట్యూన్ ఈ ఏడాదితో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ చిన్న ట్యూన్ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ సుపరిచితమైంది. భాషా, ప్రాంతీయ భేదాలు లేకుండా కనెక్ట్ చేయాలనే లక్ష్యంతో రూపొందించిన ఈ ట్యూన్ ఎయిర్‌టెల్ బ్రాండ్ కు ఒక ఆడియో లోగోగా మారింది. కాలక్రమేణా ఎయిర్‌టెల్ ప్రకటనలు, ఆఫర్లు మారినప్పటికీ ఈ కోర్ ట్యూన్ స్థిరంగా ఉంటూ బ్రాండ్ గుర్తింపును కాపాడిందని ఎయిర్‌టెల్ తెలిపింది.
