తాండూరు, వెలుగు: వికారాబాద్ జిల్లా యాలాల మండలం గోవిందరావుపేట శివారులోని ఓ స్వామీజీ ఆశ్రమంలో గంజాయి సాగు చేస్తున్న ట్లు సమాచారం అందడంతో శుక్రవారం టాస్క్ ఫోర్స్, యాలాల పోలీసులు తనిఖీలు చేపట్టారు.
36 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ సీఐ అన్వర్ షాషా తెలిపారు. స్వామీజీ పేరు, వివరాలేవీ తెలియవని, కేసు దర్యాప్తు చేస్తు న్నట్లు తాండూరు రూరల్సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
