తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్: అక్టోబర్ నెల శ్రీవారి దర్శన కోటా విడుదల.. షెడ్యూల్ ఇదే!

తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్: అక్టోబర్ నెల శ్రీవారి దర్శన కోటా విడుదల.. షెడ్యూల్ ఇదే!

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ (TTD) కీలక అలర్ట్ ఇచ్చింది. అక్టోబర్ నెలకు సంబంధించిన వివిధ రకాల దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు, గదుల కోటాను విడుదల చేసే తేదీలను ఖరారు చేసింది. భక్తులు ఈ వివరాలను గమనించి, అధికారిక వెబ్‌సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి షెడ్యూల్ ఇలా ఉంది.....

1. లక్కీ డిప్ ఆర్జిత సేవల (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళం) టికెట్ల కోటా   జూలై 18 (ఈరోజు) ఉదయం 10 గంటల నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి.  జూలై 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు భక్తులు ఆన్‌లైన్‌లో పేరు రిజిస్టర్ చేసుకోవచ్చు. లక్కీ డిప్‌లో టికెట్లు పొందిన వారు జూలై 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

2. ఆర్జిత సేవలు (కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకారం) టికెట్ల కోటా విడుదల జూలై 21న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

3. వర్చువల్ సేవలు & దర్శన స్లాట్ల టికెట్ల కోటా జూలై 21న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు.

4. అంగప్రదక్షిణ టోకెన్ల కోటా జూలై 23న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.

5. శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోటా  జూలై 23న ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదలవుతాయి.

6. వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శన టోకెన్లు
వయసు పైబడిన వారు, దివ్యాంగులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారి కోసం కేటాయించే ఉచిత ప్రత్యేక దర్శన టికెట్ల కోటా జూలై 23న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.

7. ప్రత్యేక ప్రవేశ దర్శనం (Rs.300 టికెట్లు) టికెట్ల  కోటా జూలై 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

8. తిరుమల, తిరుపతిలో వసతి గదుల (Accommodation) టికెట్ల  కోటా జూలై 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో గదుల బుకింగ్ ప్రారంభమవుతుంది.  

ముఖ్య గమనిక: శ్రీవారి దర్శన టికెట్లు, సేవా టికెట్లు లేదా గదుల బుకింగ్ కోసం భక్తులు కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ను మాత్రమే సంప్రదించాలని అధికారులు కోరారు.