వారణాసి బ్యూటీ, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఇవాళ (జులై 18, 2026న) తన 44వ పుట్టినరోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా రాజమౌళి స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ‘వారణాసి’లో ప్రియాంక చోప్రా పోషిస్తున్న ‘మందాకిని’ పాత్రకు సంబంధించిన ఫస్ట్ స్టిల్స్‌ను విడుదల చేశారు. “నవ్వితే హుందాతనం.. నవ్వకపోతే అగ్ని” అంటూ రాజమౌళి షేర్ చేసిన ఈ ఫొటోల్లో ప్రియాంక రెండు విభిన్న కోణాల్లో కనిపించారు.
Grace when she smiles.
— rajamouli ss (@ssrajamouli) July 18, 2026
Fire when she doesn’t.
Mandakini… @PriyankaChopra in #Varanasi pic.twitter.com/4lYerYbm4Q
ఒక స్టిల్‌లో ప్రియాంక తీవ్రమైన, శక్తివంతమైన లుక్‌లో కనిపించగా, మరో స్టిల్‌లో చిరునవ్వుతో ఆనందంగా కనిపించారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ప్రియాంక చోప్రా భారతీయ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ.. “సినిమాలోని భారీ యాక్షన్ ఎపిసోడ్స్ దాదాపుగా పూర్తయ్యాయి. ప్రస్తుతం చిన్న చిన్న కనెక్టింగ్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి షూటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది” అని వెల్లడించారు.
ఫ్యాన్స్ రియాక్షన్స్..
ఈ స్టిల్స్‌పై మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ చప్పట్ల ఎమోజీలతో స్పందించారు. అభిమానులు కూడా సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ‘ప్రియాంక కంబ్యాక్ కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నాం. ఇంత గొప్పగా తిరిగి రావడం ఆనందంగా ఉంది’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, మరో అభిమాని ‘దేవసేన తర్వాత రాజమౌళి సృష్టించిన అత్యుత్తమ మహిళా పాత్ర మందాకినే అవుతుంది’ అని అభిప్రాయపడ్డారు. ఇంకొందరు ‘ఇది ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ : తిరుపతిలో జూనియర్ ఎన్టీఆర్ టెన్షన్
‘వారణాసి’ గురించి..
మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం పురాణాలు, జానపద కథలు, సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ అంశాలతో తెరకెక్కుతోంది. మహేష్ బాబు ‘రుద్ర’గా, పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ అనే శక్తివంతమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఆర్. మాధవన్ ‘హనుమంతుడి’ పాత్రలో మెరవబోతున్నట్లు టాక్. మరో కీలక పాత్ర ప్రకాష్ రాజ్ పోషిస్తున్నారు. ఈ భారీ అడ్వెంచర్ డ్రామా ‘వారణాసి’ 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
