ఒక్కసారి ట్రయల్ వేయొచ్చుగా: ‘ఇలాంటి ఫాల్తూ మాటలు మాట్లాడొద్దంటూ’.. ఫోటోగ్రాఫర్పై హీరోయిన్ ఫైర్..

ఒక్కసారి ట్రయల్ వేయొచ్చుగా: ‘ఇలాంటి ఫాల్తూ మాటలు మాట్లాడొద్దంటూ’.. ఫోటోగ్రాఫర్పై హీరోయిన్ ఫైర్..

దేనికైనా ఓ హద్దు.. అదుపు ఉంటుంది. మాటకో హద్దు.. చేతకో ఆలోచన ఉండాలి. మాట జారితే తిరిగి తీసుకోలేం. తప్పు ఎవరిదో తెలుసుకోకుండా చేయి వేసుకుంటే క్షమించమని అడగలేం. అందుకే దేనికైనా ఓ లిమిట్ అనేది ఉంటుంది. ఉండాలి కూడా.. మరి ముఖ్యంగా నలుగురిలో ఉన్నప్పుడు మహిళలతో ఎలా మాట్లాడాలి..? వారితో ఎలా ప్రవర్తించాలి అనేది బేసిక్ ఆలోచన అయినా ఉండాలి. అయితే, ఇది కొంతమంది వ్యక్తుల్లో అప్పుడప్పుడు కరువైపోతూ ఉంటుంది. ఇపుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్ పై ఓ ఫోటోగ్రాఫర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

పాపరాజీపై మండిపడ్డ జరీన్ ఖాన్

బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ (Zareen Khan).. ముంబై సెలబ్రిటీ పాపరాజీపై (ఫోటోగ్రాఫర్లు) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జరీన్ ఖాన్.. అక్కడి డ్రెస్సులను పరిశీలించింది. ఈ క్రమంలోనే పాపరాజీలలో ఒకరు ‘ట్రయల్ వేయొచ్చుగా’ అని అడగడంతో ఒక్కసారిగా జరీన్ షాక్ అయింది.

ఆ వెంటనే స్పందించిన జరీన్.. సదరు కెమెరామెన్పై మండిపడుతూ..‘‘ఏంటీ మీ ముందేనా? ఇలాంటి ఫాల్తూ మాటలు నా ముందు మాట్లాడొద్దు.. కొంచెం హద్దుల్లో ఉండండి.. మహిళలతో మర్యాదగా ప్రవర్తించండి’’ అంటూ గట్టిగా హెచ్చరించింది. అనంతరం అలాంటి వ్యాఖ్యలను తాను ఏమాత్రం సహించబోనని జరీన్ స్పష్టం చేసింది. ప్రస్తుతం, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు జరీన్ ఖాన్‌కు మద్దతుగా నిలిచారు. తన ఆత్మగౌరవం కోసం వెంటనే స్పందించడం సరైన నిర్ణయమని ప్రశంసిస్తున్నారు. అలాగే, ప్రజల మధ్య సెలబ్రిటీలు ఎదుర్కొనే ఇలాంటి అసౌకర్యకర పరిస్థితులపై కూడా చర్చ మొదలైంది.

ALSO READ : ఇదే ప్యూర్ ఫిల్మ్‌మేకింగ్: మీ లైఫ్లో 3 గంటలు కేటాయించండి..

ఈ ఘటనతో భారత్‌లో పాపరాజీ సంస్కృతిపై మరోసారి చర్చ జరుగుతోంది. సెలబ్రిటీలతో వ్యవహరించే సమయంలో ఫొటోగ్రాఫర్లు వృత్తిపరమైన నైతికత, పరస్పర గౌరవం, హద్దులను పాటించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

హీరోయిన్ జరీన్ ఖాన్ గురించి:

జరీన్ ఖాన్, మహారాష్ట్రకు చెందిన సినిమా నటి, మోడల్. హిందీతో పాటుగా తమిళం, తెలుగు, పంజాబీ సినిమాలలో నటించింది. 2010లో సల్మాన్ ఖాన్‌తో కలిసి ‘వీర్’ సినిమాలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ మూవీ ఫ్లాప్ అయినప్పటికీ, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, నటనతో గుర్తింపు పొందింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘రెడీ’లో నటించి సూపర్‌హిట్ కొట్టింది.

2019లో గోపీచంద్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'చాణక్య' సినిమాతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఏజెంట్ జుబెదా పాత్రను పోషించింది. అలాగే, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలోని ‘వీరప్పన్’లో కీలక పాత్రలో నటించి ఆకట్టుకుంది. వీటితో పాటుగా ‘హౌస్‌ఫుల్ 2’, ‘హేట్ స్టోరీ 3’, ‘జాట్ జేమ్స్ బాండ్’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది.