ఉన్నవి చాలవన్నట్టు మళ్లీ ఇదోటి.. ఛాయ్ తాగేటప్పుడు సమోసా తింటే..

ఉన్నవి చాలవన్నట్టు మళ్లీ ఇదోటి.. ఛాయ్ తాగేటప్పుడు సమోసా తింటే..

టీ లవర్స్ కు బెస్ట్ కాంబో స్నాక్స్ అంటే ఏం చెబుతారు. సమోసానే కదా. కేవలం హైదరాబాద్ లోనే కాదు.. దాదాపు ఇండియా మొత్తం ఇదే టేస్టీ. టీ తాగే ముందు ఒకటి రెండు సమోసాలు తింటే ఆ సంతృప్తే వేరబ్బా అంటుంటారు. అయితే టీ, సమోసా కాంబినేషన్ మంచిదేనా..? అని ఎవరూ ఆలోచించరు. అదే మన కొంప ముంచుతుందని డాక్టర్స్ చెబుతున్నారు. 

ఆఫీస్ బ్రేక్ సమయంలోనైనా.. లేక కాస్త ఆకలిగా ఉన్న టైమ్ లోనైనా లో కాస్ట్ లో.. సింపుల్ స్నాక్స్ కింద సమోసా, చాయ్ ని సెలెక్ట్ చేసుకుంటుంటారు. టేస్టీకి టేస్టీ కూడా. అందుకే అందరు చాలా ఇష్టంగా లగాయించేస్తుంటారు.

సమోసా, టీ కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని డాక్టర్స్ అంటున్నారు. ఈ కాంబినేషన్ అప్పుడప్పుడు తినడానికి రుచిగా ఉన్నప్పటికీ, రోజూ తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, గ్యాస్, ఎసిడిటీ, బరువు పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

టీ-సమోసా కాంబినేషన్‌ పై భయంకర నిజాలు:

జీర్ణ సమస్యలు: 
సమోసా మైదా పిండితో చేసి, నూనెలో వేయిస్తారు. టీలో ఉండే కెఫిన్, టానిన్లు, వేయించిన ఆహారం కలిసి కడుపులో ఉబ్బరం, అసిడిటీ; గ్యాస్ సమస్యలను కలిగిస్తాయి. 

పోషకాలు అందవు: 
టీలోని కెఫిన్ శరీరానికి అవసరమైన ఐరన్ (Iron) ను పీల్చుకోవడంలో ఆటంకం కలిగిస్తుంది. 

ALSO READ : ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్ ఉందా..? డోంట్ వర్రీ.. మందు వచ్చేసింది !

టీ కి బెస్ట్ కాంబో ఐటమ్స్ ఇవే:

టీ తాగేటప్పుడు సమోసాలకు బదులుగా కాల్చిన శనగలు, డ్రై ఫ్రూట్స్, లేదా మఖానా వంటి తేలికపాటి చిరుతిళ్లను తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదని డాక్టర్స్ చెబుతున్నారు.