న్యూఢిల్లీ: గత 20 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తోన్న సోనమ్ వాంగ్ చుక్ ఆరోగ్య పరిస్థితిపై ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రి కీలక ప్రకటన చేసింది. దీర్ఘకాలిక ఉపవాసం, డీహైడ్రేషన్ కారణంగా అతను బలహీనంగా మారిపోయినట్లు తెలిపింది. ప్రస్తుతం వాంగ్ చుక్ హెల్త్ కండీషన్ స్టేబుల్గానే ఉన్నప్పటికీ.. అతని ఆరోగ్య పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి నిరంతర వైద్యుల పర్యవేక్షణ, నిఘా, చికిత్స అవసరమని తెలిపింది. ప్రస్తుతం ఇద్దరు వైద్యులు, ఇద్దరు పారామెడిక్‌ల ప్రత్యేక బృందం ఆయనకు చికిత్స అందిస్తోన్నట్లు వెల్లడించింది.
నా అనుమతి లేకుండా ట్రీట్మెంట్ ఇవ్వొద్దు: సోనమ్ వాంగ్ చుక్ భార్య
నా అనుమతి లేకుండా నా భర్తకు ట్రీట్మెంట్ ఇవ్వొద్దని సోనమ్ వాంగ్ చుక్ భార్య గీతాంజలి అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తన భర్త ఆరోగ్యంగానే ఉన్నారని.. ఆయనను ఆకస్మాత్తుగా ఆసుపత్రికి తీసుకురావాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ప్రస్తుతం తాను సప్దర్ జంగ్ ఆసుపత్రిలోనే ఉన్నానని తెలిపారు. నా అనుమతి, గత 20 రోజులుగా అతని ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న వైద్యుల పర్మిషన్ తీసుకోకుండా నా భర్తకు ఎలాంటి ట్రీట్మెంట్ చేయొద్దని ఆమె పేర్కొన్నారు.
ఆర్టికల్ 32 ప్రకారం ఇది రాజ్యాంగం నాకు కల్పించిన హక్కని ఆమె అన్నారు. మరోవైపు.. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా నిపుణుల వైద్య సలహా మేరకు వాంగ్‌చుక్‌ను అత్యవసర వైద్య సంరక్షణ కోసం ఆసుపత్రికి తరలించినట్లు ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు.
21 రోజులకు చేరిన వాంగ్ చుక్ దీక్ష
నీట్ పేపర్ లీక్, విద్యా వ్యవస్థలోని అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) భారీ నిరసన కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. సీజేపీ నిరసనకు మద్దతుగా ప్రముఖ పర్యావరణ వేత, విద్యావేత్త సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు.
శనివారానికి (జులై 118) ఆయన దీక్ష 21వ రోజుకు చేరుకుంది. 21 రోజులుగా తిండి, నీరు లేకపోవడంతో సోనమ్ వాంగ్ చుక్ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. ఆయన దీక్ష ఇలాగే కొనసాగిస్తే చనిపోయే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పోలీసులు బలవంతంగా ఆయనను అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు.
