మానవత్వం సిగ్గుపడే ఘటన.. దేశం మొత్తం నోరెళ్లబెట్టే విధంగా జరిగిన సిగ్గులేని ఘటన.. రోడ్డుపై న్యాయం కోసం ఓ మహిళ కూర్చుంటే.. ఆమె పై దాడి చేశారు. రోడ్డుపైనే ఆమె కొట్టటమే కాకుండా.. ఆమె దుస్తులు అన్నీ ఊడదీసి.. కాళ్లతో తన్నారు.. ఇది జరిగింది ఎక్కోడో కాదు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు సిటీలోనే.. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఇంత దారుణమా.. ఇంత దుర్మార్గమా.. ఇంత నీచమా.. మానవత్వమా సిగ్గుపడు అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే...
ఆంధ్రప్రదేశ్ గుంటూరులోని నగరంపాలెం కృష్ణబాబు కాలనీలో ఓ ఇంటి బోరు విషయమై రెండు వర్గాల మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇరువర్గాల మధ్య మాట మాట పెరిగి పెద్ద గొడవగా మారింది. ఈ వివాదంలో ఒక వర్గానికి మద్దతుగా వచ్చిన కొందరు హిజ్రాలు.. ప్రత్యర్థి వర్గానికి చెందిన ఒక మహిళపై తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. ఆమెను వివస్త్రను చేసి, అందరి ముందే దారుణంగా దాడికి పాల్పడ్డారు.
సీసీటీవీ ఫుటేజ్ వైరల్
ఈ ఘోరానికి సంబంధించిన దృశ్యాలన్నీ అక్కడ ఉన్న సీసీటీవీ (CCTV) కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీనిపై స్పందించిన నగరంపాలెం పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే ఈ దాడికి పాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
సీరియస్ అయిన ఎమ్మెల్యే.. టీడీపీ నేత సస్పెన్షన్
మహిళపై జరిగిన ఈ దాడిలో స్థానిక తెలుగుదేశం పార్టీ (TDP)కి చెందిన ఒక నాయకుడి హస్తం ఉన్నట్లు తేలడంతో రాజకీయం వేడెక్కింది. దీనిపై స్థానిక ఎమ్మెల్యే మాధవి తీవ్రంగా స్పందించారు. మహిళలపై ఇలాంటి అనాగరిక దాడులకు పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సదరు వ్యక్తి పార్టీ సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేస్తున్నట్లు, అతడిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. చట్టం ఎవరికైనా ఒక్కటేనని, నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని పోలీసులు తెలిపారు.
