వీకెండ్ వచ్చేసింది అంటే చాలు సినిమా ప్రియులు కొత్త చిత్రాల కోసం వెతుకులాట మొదలుపెడతారు. థియేటర్లకు వెళ్లే పని లేకుండా ఇంట్లోనే కూర్చొని డిఫరెంట్ జోనర్లను ఎంజాయ్ చేయాలనుకునే వారికి నిన్న (జూలై 17, శుక్రవారం) ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ భారీ కానుకను అందించాయి. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, జీ5 వంటి ప్లాట్‌ఫామ్స్‌లో ఏకంగా 23 సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. థియేటర్ రన్‌ను ముగించుకున్న బ్లాక్‌బస్టర్ చిత్రాలతో పాటు సరికొత్త ఒరిజినల్స్ ఈ లిస్ట్‌లో ఉన్నాయి.
జియో హాట్‌స్టార్ (JioHotstar)
మా ఇంటి బంగారం (Maa Inti Bangaaram):
సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా నిన్నటి నుంచే డిజిటల్ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. థియేటర్లలో భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం, హోమ్ స్క్రీన్స్‌పై కూడా యాక్షన్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది.
చాంద్ మేరా దిల్ (Chand Mera Dil):
అనన్యా పాండే, లక్ష్య లాల్వానీ జంటగా నటించిన ఈ ప్యూర్ రొమాంటిక్ లవ్ స్టోరీ యూత్‌ను టార్గెట్ చేస్తూ హాట్‌స్టార్‌లో అందుబాటులోకి వచ్చింది.
పవిత్రం సీజన్ 2 (Pavithram Season 2): ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించే మలయాళ డ్రామా సిరీస్ రెండో సీజన్ కూడా నిన్నటి నుంచే స్ట్రీమ్ అవుతోంది.
నెట్‌ఫ్లిక్స్ (Netflix)
గ్లోబల్ కంటెంట్‌తో పాటు డిఫెరెంట్ జోనర్లను ఇష్టపడే వారి కోసం నెట్‌ఫ్లిక్స్ ఈ శుక్రవారం గట్టి లైనప్‌నే దించింది.
హార్ట్‌స్టాపర్ ఫరెవర్ (Heartstopper Forever): ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పాపులర్ యూత్ సిరీస్ ఫినాలే ఫీచర్ ఫిలిం రూపంలో రిలీజ్ అయింది.
ALSO READ : జ్ఞానం కాదు.. ఆలోచన ఉంటేనే కోట్లు..
ది ఈస్ట్ ప్యాలెస్ (The East Palace):
ఫాంటసీ, మిస్టరీ థ్రిల్లర్స్‌ని ఇష్టపడే వారి కోసం ఈ కొరియన్ డ్రామా అందుబాటులోకి వచ్చింది.
23,000 లైవ్స్ (23,000 Lives) & డిజైర్ (Desire): రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన జర్మన్ డ్రామాతో పాటు రొమాంటిక్ థ్రిల్లర్ 'డిజైర్' కూడా నిన్నటి నుంచే స్ట్రీమ్ అవుతున్నాయి.
డిజైర్- (ఇంగ్లీష్ బోల్డ్ రొమాంటిక్ ఎరోటిక్ థ్రిల్లర్)- జూలై 17
ది మ్యాప్ ఆఫ్ లాంగింగ్- (స్పానిష్ రొమాంటిక్ డ్రామా సిరీస్)- జూలై 17
జీ5 (ZEE5)
ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు (Transfer Trimurthulu): వడ్డే నవీన్, రాశి సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో జీ5లో ఆకట్టుకుంటోంది.
ది డెవిల్ (The Devil): కన్నడ స్టార్ డార్లింగ్ కృష్ణ నటించిన పొలిటికల్ యాక్షన్ డ్రామా కూడా ఈ వీకెండ్ వినోదానికి తోడైంది.
శివలోక్ కె కుండక్క మండక్క: పిల్లలతో పాటు ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా రూపొందిన సరికొత్త వెబ్ సిరీస్ ఇది. హిందీ నుంచి తెలుగులోకి డబ్బింగ్ అయిన ఈ యానిమేషన్ సిరీస్.. ఇండియన్ మైథాలజీ (భారతీయ పురాణాలు), యాక్షన్, అడ్వెంచర్, మరియు అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎలిమెంట్స్‌తో సాగుతుంది.
అమెజాన్ ప్రైమ్
ఏక్ దిన్- (తెలుగు డబ్బింగ్ హిందీ రొమాంటిక్)- జూలై 17
ది బే- (ఇంగ్లీష్ ఓసియన్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్)- జూలై 17
యంగ్ ఫార్ట్స్ ట్రైలర్ పార్ట్స్- (ఇంగ్లీష్ రియాలిటీ డాక్యుమెంటరీ సిరీస్)- జూలై 17
అండర్‌కవర్ లవర్- (ఇంగ్లీష్ రియాలిటీ డేటింగ్ షో)- జూలై 17
ఆహా
గేదెల రాజు: ప్యూర్ తెలుగు నేటివిటీతో తెరకెక్కిన పొలిటికల్ క్రైమ్ సస్పెన్స్ డ్రామా చిత్రం ఇది. రాజకీయ చదరంగం, నేర ప్రపంచం బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి పర్ఫెక్ట్ ఛాయిస్. ఈ చిత్రం అటు 'ఆహా' తో పాటు ఇటు 'అమెజాన్ ప్రైమ్' లోనూ ఒకేసారి నిన్నటి (జూలై 17) నుంచే స్ట్రీమింగ్ అవుతోంది.
వోవెల్స్ (Vowels): రొమాంటిక్ డ్రామాలను ఇష్టపడే వారి కోసం సరికొత్త తమిళ అంథాలజీ సినిమా ఇది. విభిన్నమైన ప్రేమకథల సమాహారంగా తెరకెక్కిన ఈ చిత్రం కూడా జూలై 17 నుంచే డిజిటల్ ప్రీమియర్‌గా అందుబాటులోకి వచ్చింది.
లయన్స్‌గేట్ ప్లే (Lionsgate Play)
డెజర్ట్ వారియర్ (Desert Warrior): హాలీవుడ్ యాక్షన్ లవర్స్ కోసం ఇంగ్లీష్ హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ నిన్నటి నుంచి అందుబాటులోకి వచ్చింది. ఇది తెలుగు డబ్బింగ్‌తోనూ స్ట్రీమ్ అవుతోంది.
టెక్సాస్ చైన్ సా (Texas Chainsaw): హారర్, స్లాషర్ సినిమాలను ఇష్టపడే వారి కోసం ఈ మోస్ట్ పాపులర్ ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్ చిత్రం లయన్స్‌గేట్ ప్లేలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈటీవీ విన్
సమ్‌వేర్ సమ్‌టైమ్ (Somewhere Sometime) - ఈటీవీ విన్: ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామాలను ఇష్టపడే తెలుగు ఆడియన్స్ కోసం ఈ చిత్రం ప్రత్యేకంగా నిన్నటి నుంచే స్ట్రీమింగ్ అవుతోంది.
సన్ నెక్స్ట్
కమల్ శ్రీదేవి- సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ కన్నడ చిత్రం సన్ నెక్స్ట్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.
మనోరమ మ్యాక్స్
చితిని (Chithini) - హారర్, మిస్టరీతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిపిన ఈ వైవిధ్యమైన మలయాళ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్ మనోరమ మ్యాక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది.
తెలుగు సినిమాల సందడి..
జూలై 17న విడుదలైన చిత్రాల్లో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు.. సమంత లీడ్ రోల్‌లో నటించిన ‘మా ఇంటి బంగారం’, ‘గేదెల రాజు’, ‘సమ్‌వేర్ సమ్‌టైమ్’, వడ్డే నవీన్ నటించిన సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు డబ్బింగ్ కంటెంట్ విషయానికొస్తే.. హాలీవుడ్ హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘డెజర్ట్ వారియర్’ లయన్స్‌గేట్ ప్లేలో తెలుగు ఆడియన్స్‌ను అలరిస్తున్నాయి. అలాగే, పిల్లలను అమితంగా ఆకట్టుకునేలా ఇండియన్ మైథాలజీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన యానిమేషన్ కామెడీ వెబ్ సిరీస్ ‘శివలోక్ కె కుండక్క మండక్క’, మరియు హిందీ రొమాంటిక్ చిత్రం ‘ఏక్ దిన్’ అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్‌కు వచ్చాయి.
