72వ జాతీయ చలన చిత్ర పురష్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024లో విడుదలైన సినిమాలకు సంబంధించిన అవార్డులను ఈరోజు( జూలై 18, 2026) అధికారంగా వెల్లడించింది. భారతీయ సినీ పరిశ్రమలో నటీనటులు, సాంకేతిక నిపుణులు చేసిన విశేషమైన కృషికి గాను అత్యంత ప్రతిష్టాత్మమైన ఈ అవార్డులను సొంతం చేసుకున్నారు. ఈసారి ఉత్తమ నటుడి అవార్డు ఇద్దరు పంచుకున్నారు . కార్తీక్ ఆర్యన్ (చందూ ఛాంపియన్), మమ్ముట్టి (బ్రమయుగం) లకు పురష్కారం వరించింది. ఉత్తమ నటిగా యామి గౌతమ్ ( ఆర్టికల్ 370 ) ఎంపికయ్యారు. ఉత్తమ తెలుగు చిత్రంగా 'కమిటీ కుర్రోళ్లు' ఎంపికైంది. ఉత్తమ దర్శకుడిగా రాజ్ కుమార్ పెరియాసామి ( అమరన్ ) కు దక్కింది. 72వ జాతీయ అవార్డుల విజేత జాబితా చూద్దాం..
72వ జాతీయ అవార్డుల జాబితా
ఉత్తమ చిత్రం (Best Feature Film): ఆర్టికల్ 370
ఉత్తమ నటుడు: కార్తీక్ ఆర్యన్ (చందూ ఛాంపియన్), మమ్ముట్టి (బ్రమయుగం)
ఉత్తమ నటి: యామీ గౌతమ్ (ఆర్టికల్ 370)
ఉత్తమ దర్శకుడు : రాజ్‌కుమార్ పెరియసామి (అమరన్)
ఉత్తమ సహాయ నటి : రూపశ్రీ వర్కాడి (మిథ్యా), సచనా నమిదాస్ (మహారాజా)
ఉత్తమ సహాయ నటుడు : సంజయ్ మిశ్రా (భక్షక్)
ఉత్తమ ప్రజాదరణ సినిమా : కల్కి 2898 AD
జాతీయ, సామాజిక విలువల ఉత్తమ చిత్రం: కెప్టెన్ మిల్లర్
ఉత్తమ బాలనటులు: రిద్ధిమాన్ బెనర్జీ, తపోమయ్ దేవ్, గీతాశ్రీ చక్రవర్తి, అరుందేవ్ పోతుల, అతిష్ ఎస్. శెట్టి
సాంకేతిక విభాగాలు
ఉత్తమ సినిమాటోగ్రఫీ : షెహ్నాద్ జలాల్ (బ్రమయుగం)
ఉత్తమ స్క్రీన్‌ప్లే : సుకుమార్ (పుష్ప 2)
ఉత్తమ డైలాగ్ రైటర్ : వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ : కల్కి 2898 AD
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ : కమిటీ కుర్రాళ్లు
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ : దీపాలి నూర్, షీతల్ శర్మ (పుష్ప 2)
ఉత్తమ పాటల సంగీత దర్శకుడు : శశ్వత్ సచ్‌దేవ్ (ఆర్టికల్ 370)
ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ : అమరన్
ఉత్తమ నేపథ్య గాయకుడు : అభయ్ జోధ్‌పుర్కర్
ఉత్తమ నేపథ్య గాయని : వైకోం విజయలక్ష్మి (ARM)
ఉత్తమ కొరియోగ్రఫీ : స్త్రీ 2
ఉత్తమ సౌండ్ డిజైన్ : మానస్ చౌదరి (భూల్ భులయ్యా 3)
ఉత్తమ ఎడిటింగ్ : ఆర్. కలైవన్నన్ (అమరన్)
ఉత్తమ ప్రాంతీయ చిత్రాలు
తెలుగు : కమిటీ కుర్రాళ్లు
హిందీ : శ్రీకాంత్
తమిళం : రాయన్
మలయాళం : ఫెమినిచి ఫాతిమా
కన్నడ : మిథ్యా
మరాఠీ : ముక్కం పోస్ట్ బొంబిల్వాడి
బెంగాలీ : చలచిత్ర ఏఖోన్
ఒడియా : లహరి
గుజరాతీ : మారన్
మణిపురి : సునీత
కొంకణి : మోగ్ అసుం
నాన్-ఫీచర్ విభాగం
ఉత్తమ నాన్-ఫీచర్ చిత్రం : భంగార్ (Obsolete)
ఉత్తమ తొలి దర్శకుడి చిత్రం : అంగెన్ (Invisible)
ఉత్తమ డాక్యుమెంటరీ : రామ్-నామీ
ఉత్తమ యానిమేషన్ చిత్రం : టచ్డ్ యాజ్ వాటర్ ( Touched as Water)
ఉత్తమ షార్ట్ ఫిల్మ్ : హమ్‌సఫర్
ఉత్తమ దర్శకుడు (నాన్-ఫీచర్ ) : ఆనంద్ ఎల్. రాయ్ (Statue of Unity – Ekta Ka Prateek)
ఉత్తమ సినిమాటోగ్రఫీ : ఎడ్మండ్ రాన్సన్ (Life in Loom)
ఉత్తమ సౌండ్ డిజైన్ : టి.ఎస్. హరి హర సుధన్ (Blue)
ఉత్తమ ఎడిటింగ్ : మన్వీర్ జస్రోతియా (NDA)
సామాజిక, పర్యావరణ విలువలను ప్రోత్సహించిన ఉత్తమ నాన్-ఫీచర్ చిత్రం: Piplantri: A Tale of Eco Feminism
ఉత్తమ జీవిత చారిత్రక చిత్రం : కాకోరి
ఉత్తమ కళా, సంస్కృతి చిత్రం : Main Nida
ఉత్తమ సినీ విమర్శకుడు: సంజీవ్ శ్రీవాస్తవ (హిందీ)
మీయళగన్ – సౌండ్ మిక్స్ ఇంజినీర్ సురెన్ జీకి ప్రత్యేక గుర్తింపు.
