ఉత్తమ తమిళ సినిమా అవార్డ్ సొంతం చేసుకున్న ‘రాయన్’

ఉత్తమ తమిళ సినిమా అవార్డ్ సొంతం చేసుకున్న ‘రాయన్’

72వ జాతీయ చలన చిత్ర అవార్డులను జ్యూరీ ప్రకటించింది. 2024లో విడుదలైన సినిమాలకు అవార్డులు ప్రకటించారు. ఉత్తమ తెలుగు సినిమా అవార్డు కమిటీ కుర్రోళ్లు సినిమాకు రాగా, ఉత్తమ తమిళ సినిమాగా ధనుష్ రాయన్ నిలిచింది. రాయన్ సినిమాకు ధనుష్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ధనుష్‌‌‌‌ హీరోగా నటించిన 50వ సినిమా రాయన్. సందీప్ కిషన్‌‌‌‌, కాళిదాస్ జయరామ్, సెల్వ రాఘవన్‌‌‌‌, ఎస్‌‌‌‌జే సూర్య కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. ఏషియన్, సురేష్ ఎంటర్‌‌‌‌టైన్‌‌‌‌మెంట్ ఎల్‌‌‌‌ఎల్‌‌‌‌పి తెలుగులో విడుదల చేయడం గమనార్హం.

ALSO READ : 72వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో దుమ్ములేపిన తెలుగు సినిమాల లిస్ట్ ఇదే !

ధనుష్ హీరోగా అదే సంవత్సరం సంక్రాంతికి తమిళ్లో విడుదలైన ‘కెప్టెన్ మిల్లర్‌‌‌‌‌‌‌‌’(Captain Miller) సినిమాకు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డ్ దక్కింది. ఈ సినిమాకు అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించాడు. టీజర్‌‌‌‌‌‌‌‌,ట్రైలర్తో ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచిన దర్శకుడు సినిమాతో తీవ్ర అసంతృప్తికి గురిచేశారు. తెలుగులో ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చింది. ధనుష్‌ నటనకు మాత్రం విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి.