రోజ్ టీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. బరువు తగ్గేందుకు బెస్ట్ డ్రింక్.!

రోజ్ టీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. బరువు తగ్గేందుకు బెస్ట్ డ్రింక్.!

యాక్టివ్ గా , హెల్దీగా ఉండాలంటే ఛాయ్ తాగాల్సిందే అనుకుంటారు చాలామంది. ఛాయ్ లలో  చాలా రకాలు ఉంటాయి. వాటిలో 'రోజ్ టీ' ఒకటి. టేస్టీగా ఉండే ఈ టీ హెల్త్ కు  ఎంతో మంచిది. ఈ రోజ్ టీ లో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. శరీరంలో యాంటీబాడీస్ ను పెంచుతుంది. పూర్తి ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమయ్యే పోషకాలన్నీ రోజ్ ఛాయ్ లో ఉన్నాయని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. ముఖ్యంగా రోజ్ టీ బరువు తగ్గించడంలో బాగా పని చేస్తుంది. వెయిట్ తగ్గాలనుకునేవాళ్లు రకరకాల డైట్స్ ఫాలో అవుతుంటారు. వాటితో పాటు రోజ్ ఛాయ్ ని తాగితే సులువుగా బరువు తగ్గొచ్చని అంటున్నారు డాక్టర్లు.

ఈ ఛాయ్ ని రోజూ తాగడం వల్ల చర్మం మెరుస్తుంది. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.రోజ్ టీ జీర్ణ సంబంధిత సమస్యల్ని తగ్గిస్తుంది.స్ట్రెస్ బస్టర్ గా పనిచేసి.. మానసిక ప్రశాంతతను ఇస్తుంది. శరీరంలోని టాక్సిన్ ను  తొలగిస్తుంది.

కావాల్సినవి...

ఏడు నుంచి పది గులాబీ రేకలు, కప్పు నీళ్లు, తేనె, నిమ్మరసం.

తయారీ

తాజా గులాబీ పూరేకలను తీసుకోవాలి. వాటిని శుభ్రంగా కడగాలి. ఒక గిన్నెలో నీళ్లు వేడిచేయాలి. ఆ వేడి నీళ్లలో గులాబీ రేకలను వేసి పది నిమిషాలు మరిగించాలి. తర్వాత ఈ నీళ్లని ఒక కప్పులో వడకట్టాలి. అందులో తేనె, నిమ్మరసం కలుపుకుని తాగాలి.