గుంటూరు కృష్ణబాబు కాలనీలో మహిళను వివస్త్రను చేసి అమానుషంగా దాడి చేసిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ లో కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టారు జగన్. మహిళను వివస్త్రను చేసి దాడి చేయడం సరికాదని అన్నారు. ఇదేనా సుపరిపాలన, ఇదేనా పోలీసింగ్ అంటూ ప్రశ్నించారు జగన్. మహిళను వివస్త్రను చేసి, టీడీపీ నాయకుడు దాడికి పాల్పడిన ఘటన మానవత్వానికే మచ్చ మాత్రమే కాదు.. రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ ఎంత ఘోరంగా విఫలమైందో చెప్పడానికి నిలువెత్తు నిదర్శనమని అన్నారు. ఈ దారుణానికి చంద్రబాబు ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు జగన్.
బుధవారం ( జులై 15 ) ఘటన జరిగితే.. మూడు రోజులపాటు దాన్ని కప్పిపెట్టినా.. చివరకు ఆ వీడియోలు సోషల్‌మీడియాలో బయటకు వచ్చి రాష్ట్ర ప్రజలంతా చూసి ఈ పరిపాలనను అసహ్యించుకున్న తర్వాత ఇప్పుడు తానేదో గొప్పగా చర్యలు తీసుకుంటున్నట్లు చంద్రబాబు హడావుడి చేయడం మరింత సిగ్గుచేటని మండిపడ్డారు జగన్. వీడియోలు కప్పిపుచ్చడంపై శ్రద్ధ చూపే బదులు బుధవారమే తనపై తొలిసారి దాడి జరిగిన తర్వాత బాధిత మహిళ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు స్పందించి ఉంటే ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదు కదా అని అన్నారు.
గుంటూరు నగరంలో ఒక మహిళను వివస్త్రను చేసి, టీడీపీ నాయకుడు దాడికి పాల్పడిన ఘటన మానవత్వానికే మచ్చ మాత్రమే కాదు.. రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ ఎంత ఘోరంగా విఫలమైందో చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం. ఈ దారుణానికి చంద్రబాబు ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి.
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 18, 2026
బుధవారం ఘటన జరిగితే.. మూడు…
బాధితురాలు ఫిర్యాదుపై వెంటనే కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకొని ఉంటే ఈ దారుణం జరిగేదా అని ప్రశ్నించారు జగన్.మహిళకు రక్షణ కల్పించకుండా మౌనం వహించడం ఎంతవరకు న్యాయమని అన్నారు. ఇక పోలీస్ స్టేషన్లు ఉన్నది ఎందుకని ప్రశ్నించారు జగన్.
రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు, సోషల్‌మీడియా యాక్టివిస్టులపై ఈ చంద్రబాబు ప్రభుత్వం దగ్గరుండి దాడులను ప్రోత్సహించిందని అన్నారు. ఆ అరాచకాలను కప్పిపుచ్చడానికి పోలీసు వ్యవస్థను రాజకీయ ఆయుధంగా మార్చిందని... చట్టాన్ని అధికార పార్టీకి చుట్టంగా, ప్రతిపక్షాలపైనా, బాధితులపైనా వేధింపులకు, అక్రమ కేసులకు ఒక సాధనంగా మార్చి రాష్ట్రాన్ని జంగిల్‌రాజ్‌గా దిగజార్చిందని అన్నారు జగన్.
