గోదావరిలో ఐదుగురు గిరిజన మహిళలు గల్లంతు: ముగ్గురి మృతదేహాలు లభ్యం

గోదావరిలో ఐదుగురు గిరిజన మహిళలు గల్లంతు: ముగ్గురి మృతదేహాలు లభ్యం

అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం దగ్గర గోదావరి నదిలో ఘోర ప్రమాదం జరిగింది. చేపలు పట్టడానికి వెళ్లిన ఐదుగురు గిరిజన మహిళలు నదిలో మునిగిపోయారు. నదిలో చేపలు పడుతున్న సమయంలో, నీళ్లు లోతుగా ఉన్న వైపు వెళ్లడం వల్లే వీరంతా కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన వారంతా గొమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందినవారు.

ప్రమాదం గురించి తెలియగానే పోలీసులు, స్థానికులు కలిసి నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ముగ్గురి మృతదేహాలు లభ్యమవ్వగా, మిగిలిన ఇద్దరి కోసం వెతుకులాట కొనసాగుతోంది. మరణించిన వారిని ఊకె సుశీల (37), ఊకె లక్ష్మి (37), తుర్రం భారతి (40), భాసుబోయిన బాలరాజు (38), ఊకె రమేష్ (38)గా గుర్తించారు.

ALSO READ : విక్రమ్-1 విక్టరీ తెలంగాణకు గర్వ కారణం..

ఒకే గ్రామానికి చెందిన ఐదుగురు చనిపోవడంతో గొమ్ముకొత్తగూడెం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రస్తుతం మృతదేహాలను పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాక వారి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. కాగా, ఈ ప్రమాదంపై ఏపీ మంత్రి సంధ్యారాణి స్పందిస్తూ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.