చాంద్రాయణగుట్ట పబ్లిక్ కు అలర్ట్... మీరు తినే ఫాస్ట్ ఫుడ్ ఎంత ఘోరమో చూడండి...!

చాంద్రాయణగుట్ట పబ్లిక్ కు అలర్ట్... మీరు తినే ఫాస్ట్ ఫుడ్ ఎంత ఘోరమో చూడండి...!

హైదరాబాద్ లోని చాంద్రాయణగుట్టలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. శనివారం ( జులై 18 ) నిర్వహించిన ఈ తనిఖీల్లో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. చంద్రాయణగుట్టలో పలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై దాడులు నిర్వహించిన అధికారులు నిబంధనలు ఉల్లంఘించిన రెండు సెంటర్లపై కేసులు నమోదు చేసి.. ముగ్గరు నిర్వాహకులను అరెస్ట్ చేశారు.
 
పలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో వాడేసిన వంట నూనెను మళ్లీ వినియోగిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు అధికారులు. కృత్రిమ రంగులు కలిపిన చికెన్, ఫుడ్ కలర్స్ స్వాధీనం చేసుకున్నామని... సుమారు 40 కిలోల ఫ్రైడ్ చికెన్, 40 కిలోల పచ్చి చికెన్ సీజ్ చేశామని తెలిపారు అధికారులు. 20 లీటర్ల వాడిన నూనె, 10 లీటర్ల తాజా నూనె స్వాధీనం చేసుకున్నారు అధికారులు.

ALSO READ : రెస్టారెంట్‌ లేదా హోటల్లో ఫుడ్ బాగోలేదా ? సైలెంట్‌గా ఉండకండి

పలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో అపరిశుభ్ర వాతావరణంలో ఆహారం తయారు చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. FSSAI లైసెన్స్, ఎక్స్‌పైరీ తేదీలు తప్పనిసరిగా తనిఖీ చేయాలని సూచిస్తున్నారు అధికారులు. ఆహార కల్తీపై సమాచారం ఉంటే H-FAST టోల్ ఫ్రీ 8712661212కు ఫిర్యాదు చేయాలని సూచించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు.