ఉప్పల్ భగాయత్ ఫేజ్-2లో బైక్ రేసర్ల వీరంగం... డీ-మార్ట్ దగ్గర ప్రమాదకర స్టంట్లతో హల్‌చల్.

ఉప్పల్ భగాయత్ ఫేజ్-2లో బైక్ రేసర్ల వీరంగం... డీ-మార్ట్ దగ్గర ప్రమాదకర స్టంట్లతో హల్‌చల్.

హైదరాబాద్ లో యువత బైక్ రేసింగ్ తో రెచ్చిపోతున్నారు. గచ్చిబౌలి, హైటెక్ సిటీ లాంటి ఏరియాల్లో బైక్ రేస్ లు, రిస్కీ స్టంట్లతో సరదా కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నారు యువత. పోలీసులు ఎక్కడికక్కడ బైక్ రేసింగ్ అరికట్టేలా చర్యలు తీసుకుంటున్నా యువత ఆకతాయిల ఆగడాలు ఆగడం లేదు. ఉప్పల్ భగాయత్ ఫేజ్-2లో కూడా యువత బైక్ రేసింగ్ లతో వీరంగం సృష్టిస్తున్నారు. డీమర్ట్ దగ్గర ప్రమాదకర స్టంట్లు చేస్తూ హల్చల్ చేస్తున్నారు యువకులు. 

వాసవి మెట్రోపొలిస్ ఎదురుగా అత్యంత వేగంతో బైక్ రేసింగ్ లు చేస్తున్నారని అంటున్నారు స్థానికులు. సైలెన్సర్లు తొలగించిన బైక్‌లతో భారీ శబ్దాలతో స్టంట్లు చేస్తున్నారని.. మహిళలు, చిన్నారులు, పాదచారులు భయాందోళలనకు గురవుతున్నామని అంటున్నారు. ట్రాఫిక్ రద్దీ సమయంలోనే స్టంట్లకు పాల్పడుతున్నారని...  విశాలమైన రోడ్లను రేసింగ్ ట్రాక్‌లుగా మార్చుకుంటున్నారని మండిపడుతున్నారు స్థానికులు.

ALSO READ : చాంద్రాయణగుట్ట పబ్లిక్ కు అలర్ట్... 

ప్రమాదకరమైన బైక్ రేసింగ్ పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసుల పెట్రోలింగ్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. బైక్ రేసర్లను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.