హార్మూజ్ పై ఆధిపత్యాన్ని వదులుకోని ఇరాన్.. పశ్చిమాసియాలో తన డామినెన్స్ కొనసాగించేందుకు ఎంతకైనా తెగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. తమ సార్వభౌమత్వాన్ని వదులుకోమని చెప్తూ వస్తున్న ఇరాన్.. యుద్ధం స్టైల్ ను మార్చేసింది. ఇన్నాళ్లు ముడి చమురు కేంద్రంగా సాగించిన యుద్ధం.. ఇపుడ మరో అంశంపైకి శిఫ్ట్ అవుతున్నట్లు కనిపిస్తోంది. అమెరికాకు సాయం చేస్తున్న పొరుగు దేశాల ఆయిల్ కేంద్రాలపై దాడులు చేసిన ఇరాన్.. ఇప్పటి నుంచి జీవనాధారం అయిన నీటి వనరులపై దాడులకు దిగుతోంది. కువైట్ కీలక నీటి డిసాలినేషన్ సెంటర్ పై దాడి చేస్తూ అమెరికాకు స్ట్రాంగ్ మెసేజ్ పంపించింది.
పశ్చిమాసియాలో దాదాపు అన్ని దేశాలను తమ కంట్రోల్ లోకి తెచ్చుకున్న అమెరికా.. ఇరాన్ ను లొంగదీసుకోవడం కూడా పెద్ద కష్టం కాదనుకుంది. ఇజ్రాయెల్ సహాయంతో చెప్పుచేతల్లోకి తెచ్చుకుందాం అనుకున్న ప్రయత్నాన్ని ఇరాన్ తిప్పికొడుతూ వస్తోంది. అయితే అమెరికాను దెబ్బకొట్టాలంటే వేల మైళ్ల దూరం వెళ్లి యుద్ధం చేయలేం. అందుకోసం అమెరికాకు సాయం చేస్తున్న పొరుగు దేశాలను టార్గెట్ చేసి అమెరికాకు బుద్ధి చెప్పాలని ఇరాన్ భావిస్తోంది. ఇందులో భాగంగా లేటెస్టుగా కువైట్ తాగునీటి ఆధారాలపై దెబ్బకొట్టేందుకు సిద్ధమైంది.
అమెరికా మిలిటరీకి సహకారం అందిస్తున్న దేశాలు.. మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్న ఇస్లామిక్ రెవొల్యుషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC).. తాగునీటి ఆధారాలపై దెబ్బకొట్టే వ్యూహాలకు పదును పెట్టింది. పొరుగు దేశాల రక్షణ శాఖను వినియోగించుకుని ఇరాన్ పై అమెరికా టార్గెట్ చేస్తోందని ఆరోపించింది.
ఇరాన్ పై దాడి చేసేందుకు అమెరికాకు సాయం చేస్తున్న దేశాలు.. అమెరికా ఎంత దాడి చేస్తుందో అంత నష్టాల్ని భరించేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది.
శనివారం (జులై 18) ఉదయం కువైట్ కరెంట్, నీటి శుద్ధి కేంద్రాలపై దాడి చేసింది ఇరాన్. కువైట్ కు తాగు నీళ్లు అందించే కీలక ఆధారమైన వాటర్ ప్లాంట్ పై ఇరాన్ దాడి చేసింది. దీంతో పాటు 24 గంటల వ్యవధిలో రెండు ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ పై దాడి చేసింది.
ALSO READ : భీకర దాడులు..చాబహర్ పోర్టులో కుప్పకూలిన టవర్
ఇనాళ్లు క్రూడ్ ఆయిల్, పెట్రోల్ డజిల్ పై జరిగిన యుద్ధం కాస్త మంచి నీటి మీదికి షిఫ్ట్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్ లో మంచి నీళ్ల కంటే ఆయిలే ఎక్కువ దొరుకుంది. బోర్లు వేసినా.. ఆయిల్ బయటకు వచ్చే పరిస్థితే కానీ.. మంచి నీళ్లు దొరకవు. దీంతో నీటి ఆధారంపై దెబ్బ కొడితే కువైట్ తో పాటు ఇతర దేశాలు కూడా లైన్ లోకి వస్తాయని భావిస్తోంది.
గల్ఫ్ కంట్రీస్ లో మంచినీళ్లు చాలా కీలకం. ఎక్కడ తవ్వినా క్రూడ్ ఆయిల్ లభిస్తుండటంతో... గత కొన్నేళ్లుగా ఈ గల్ఫ్ కంట్రీస్.. సముద్రం నీటిని శుద్ధి చేసి వాడుకుంటున్నాయి. అమెరికాకు సాయం ఆపకుంటే ఆ వాటర్ ఫెసిలిటీ సెంటర్లపై మరోసారి దాడి చేస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది.
