రాష్ట్ర ప్రభుత్వం టామ్ కామ్ ద్వారా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టామ్ కామ్స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంపై విమర్శలు చేశారు కేటీఆర్. విదేశీ భాష కాదు, ఇక్కడ ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశారు కేటీఆర్. విదేశీ భాషలు ఎందుకు నేర్చుకోవాలంటూ ప్రశ్నించారు. శనివారం ( జులై 18 ) సరూర్ నగర్ లో బీఆర్ఎస్ నిర్వహించిన యువసంగ్రామ సభలో మాట్లాడుతూ ఈమేరకు వ్యాఖ్యలు చేశారు కేటీఆర్.
స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమమ తప్పు అన్న రేంజ్ లో కామెంట్స్ చేశారు కేటీఆర్. టీచర్లకే విదేశీ భాష రాదంటూ సెటైర్లు వేశారు కేటీఆర్.
ALSO READ : ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత
రెండేళ్లలో 80 వేల విదేశీ ఉద్యోగాలు కల్పించొచ్చని సర్కార్ అంటోంటే... విదేశీ భాష ట్రైనింగ్ కు, స్కూల్ భాషకు లింక్ పెట్టి కామెంట్స్ చేశారు కేటీఆర్.ప్రభుత్వం టామ్ కామ్ ద్వారా ప్రతిష్టాత్మకంగా విదేశీ భాష నేర్పిస్తున్న క్రమంలో కేటీఆర్ కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.
