ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత: CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేపై సిరా చల్లి దాడి..

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత: CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేపై సిరా చల్లి దాడి..

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తీవ్ర కలకలం రేగింది. సీజేపీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేపై ఓ మహిళ నీలిరంగు సిరా (Blue Ink) చల్లి, దాడి చేయడానికి ప్రయత్నించింది.

అసలేం జరిగిందంటే.. అభిజీత్‌పై సిరా చల్లిన తర్వాత, సదరు మహిళ ఆయనను చెంపదెబ్బ కొట్టడానికి కూడా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దింతో జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

వెంటనే అలర్ట్ అయిన పోలీసులు జోక్యం చేసుకుని, గొడవ పెద్దది కాకుండా పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

అభిజీత్ దిప్కే స్పందన
ఈ ఘటన జరిగిన తర్వాత అభిజీత్ దిప్కే చాలా కూల్‌గా స్పందించారు. "బ్లూ ఈజ్ మై కలర్.. జై భీమ్!" అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

ALSO READ : అమీర్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు..?

 ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను పోలీసులు ఆసుపత్రికి తరలించడంతో, దానికి నిరసనగా జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నిరసనల మధ్యలో అభిజీత్‌పై ఈ దాడి జరగడం గమనార్హం.