టెలివిజన్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ రియాలిటీ కమ్ నాలెడ్జ్ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి' (KBC) . 2000లో ప్రారంభమైన ఈ KBC షో రెండు దశాబ్దాలకు పైగా కోట్లాది మంది ప్రేక్షకులను అలరిస్తూ భారత టెలివిజన్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. జ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన ఈ షో అనేక మంది సాధారణ కుటుంబాల జీవితాలను మార్చింది. ఇప్పుడు మరోసారి ఈ షో సరికొత్త అవతారంలో దుమ్మురేపడానికి సిద్ధమైంది.
KBC షో రెడీ..
ఈ'కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC)' షోకు బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా చేస్తున్నారు. భారీ అంచనాలతో మైండ్ బ్లోయింగ్ 18వ సీజన్ అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఆగస్టు 10 నుంచి సోమవారం టు శుక్రవారం రాత్రి 9 గంటలకు సోని ఎంటర్టైన్మెంట్ టెలివిజన్, సోని లివ్ (Sony LIV) ఓటీటీల్లో హల్చల్ చేయనుంది.
రూటు మార్చిన మేకర్స్..
అయితే, ఈసారి ఆట మామూలుగా ఉండదు బాస్! స్మార్ట్ఫోన్లలో గూగుల్ తల్లి, చాట్ జీపీటీలు వచ్చాక ఏ ప్రశ్నకైనా సెకన్లలో ఆన్సర్ దొరికేస్తోంది. అందుకే KBC మేకర్స్ రూట్ మార్చారు. ఈ సీజన్ కోసం 'సోచ్నా పడేగా' (ఆలోచించాల్సిందే!) అనే క్రేజీ థీమ్‌ను తీసుకొచ్చారు. అంటే.. ఇకపై కేవలం హిస్టరీ, జాగ్రఫీ బుక్స్ బట్టీ పట్టి, సమాధానాలు గుర్తుపెట్టుకుంటే ఇక్కడ పప్పులు ఉడకవు. సమాచారం అందరికీ అందుబాటులో ఉన్న ఈ డిజిటల్ యుగంలో.. ఆ నాలెడ్జ్‌ను ఎంత తెలివిగా అప్లై చేశాం? ఎంత విశ్లేషణాత్మకంగా ఆలోచించాం? అనేదే ముఖ్యం.
గెలవాలంటే ఇది తప్పదు..
మీ ఫోన్లో ప్రతి ప్రశ్నకు సమాధానం దొరకొచ్చు. కానీ KBC 18 హాట్ సీట్‌పై గెలవాలంటే మాత్రం ఖచ్చితంగా ఆలోచించే తీరుండాలి అంటూ బిగ్ బి వదిలిన డైలాగ్స్ అండ్ ప్రోమోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. నిజమైన విజయం అనేది సమాచారాన్ని గుర్తుంచుకోవడంలో కాదు.. దాన్ని సరైన సందర్భంలో ఉపయోగించడంలోనే ఉందని KBC-18 సందేశం ఇస్తోంది
ALSO READ : అమీర్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు..?
కోట్లలో ప్రైజ్ మనీ..
ఈసారి కూడా ప్రైజ్ మనీని విజేతకు గట్టిగా అందనున్నట్లు సమాచారం. రూ. 7.5 కోట్ల భారీ ప్రైజ్ మనీని టార్గెట్ చేస్తూ సాగే ఈ మైండ్ గేమ్‌లో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, క్రిటికల్ థింకింగ్ అత్యంత కీలకం కానున్నాయి. 2000 సంవత్సరంలో మొదలైన ఈ షోకు రెండు దశాబ్దాలు దాటినా, ఎనభై ఏళ్ల వయసులోనూ అమితాబ్ బచ్చన్ చూపిస్తున్న ఎనర్జీతో బుల్లితెరపై రికార్డులు తిరగరాస్తోంది.
