బేవకూఫ్ మాటలు మానుకో కేటీఆర్ : స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్

బేవకూఫ్ మాటలు మానుకో కేటీఆర్ : స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్

బీఆర్ఎస్ యువసంగ్రామ సభ వేదికగా కేటీఆర్ వేసిన సెటైర్లకు ఘాటుగా రిప్లై ఇచ్చింది కాంగ్రెస్.కేటీఆర్ కామెంట్స్ పై స్పందిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఏఐసీసీ సెక్రెటరీ సంపత్ కుమార్. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ డెత్ డిక్లరేషన్ అంటావా..?, తొడ్కల్ తీస్తాం బిడ్డా కేటీఆర్.. బేవకూఫ్ మాటలు మానుకో అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సంపత్ కుమార్. అంధకారంలో ఉన్నది నువ్వు, మేము కాదు.. పదేళ్లు చోరీ మీదనే దృష్టి పెట్టారు అందుకే బీఆర్ఎస్ కి కేవలం చోరీలు తెలుసని అన్నారు.

కల్వకుంట్ల కుటుంబం సంకుచిత రాజకీయాలు చేస్తోందని అన్నారు. రేవంత్ రెడ్డి ఫైన్ ఆర్ట్స్ చేసి గోడలకు పెయింట్ వేసిన అని చెప్పిన దమ్మున్నోడు అని.. నువ్వు అమెరికాలో చిప్పలు కడిగిన అని చెప్పగలవా అంటూ ప్రశ్నించారు. కేటిఆర్ పొద్దుగూకులు జోబులు, బీరువాలు నిండాయా అని చూస్తాడని..యువకులను రెచ్చగొట్టి ఏదైనా జరిగితే కేటిఆర్ చలిమంట కాచుకుందాం అనుకుంటుండని మండిపడ్డారు సంపత్ కుమార్.

బీఆర్ఎస్ యువసంగ్రామ సభ ఒక షో అని... వంద ఎలుకలు తిన్న పిల్లి సామెత బీఆర్ఎస్ కు సెట్ అవుతుందని అన్నారు. కేటీఆర్ సుప్పనాతి మాటలు ఎవరు నమ్మే పరిస్థితి లేదని... 70 వేల ఉద్యోగాలు ఇచ్చిన్నం నిరూపిస్తామని అన్నారు.ఎల్బీ స్టేడియంకు రా లెక్క తక్కువైతే తల నరుక్కుంటానని ఛాలెంజ్ విసిరారు సంపత్ కుమార్. డేట్ నువ్ ఫిక్స్ చెయ్.. నేను రెడీగా ఉంటానంటూ సవాల్ విసిరారు.

కేటీఆర్ పదేళ్లు ఉద్యోగాలు ఇస్తే.. ఇవాళ ఎవరు ఉద్యోగం అడగకపోతుండేనని.. మూడు లక్షల జీతం వదులుకున్న అంటున్నావు మూడు లక్షల కోట్లు ఎట్లా వచ్చాయని అన్నారు.