
ఐపీఎల్‌ను వారం రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు బీసీసీఐ శుక్రవారం (మే 9) తెలిపింది. వారం రోజుల తర్వాత ఐపీఎల్ ప్రారంభమైందని ఐపీఎల్ చైర్మన్ ప్రకటించినా ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మెగా లీగ్ ఇప్పట్లో తిరిగి మొదలయ్యే అవకాశం కనిపించడం లేదు. ఐపీఎల్ తిరిగి ఎప్పుడు ప్రారంభమమవుతుందో చెప్పడం కష్టం. కానీ ఎక్కడ మ్యాచ్ కు జరుగుతాయనే విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. ఐపీఎల్ లో మిగిలిన మ్యాచ్ ల కోసం బీసీసీఐ మూడు వేదికలను సిద్ధం చేసినట్టు సమాచారం. మిగిలిన మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వడానికి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాలు షార్ట్‌లిస్ట్ చేయబడ్డాయి. ప్రభుత్వ ఆమోదం ఇస్తే వెంటనే ఐపీఎల్ స్టార్ట్ కానుంది.
మార్చి 22 నుంచి ఈ నెల 25 వరకు షెడ్యూల్ చేసిన ఐపీఎల్18వ సీజన్‌లో ఇంకా 16 మ్యాచ్‌లు మిగిలున్నాయి. ఇందులో 12 లీగ్ మ్యాచ్‌లు కాగా.. నాలుగు ప్లేఆఫ్స్ దశవి. గురువారం పంజాబ్ కింగ్స్–ఢిల్లీ క్యాపిటల్స్ పోరుమధ్యలోనే నిలిపివేసినా.. ఇరు జట్లకూ పాయింట్లు కే టాయించలేదు. ఐపీఎల్ ఎప్పుడు మొదలైనా ఎక్కడ నుంచి ఆగిపోయిందో అక్కడ నుంచి ప్రారంభం కానుంది. పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగబోయే మ్యాచ్ మళ్ళీ మొదటి నుంచి ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య గురువారం (మే 7) మ్యాచ్ ప్రారంభమైంది.
ఈ నెలలో సాధ్యం కాకపోతే ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లను సెప్టెంబర్‌లో ఆసియా కప్ జరిగే విండోలో నిర్వహించే అవకాశం ఉంది. ఆసియా కప్‌లో పాక్ మ్యాచ్‌లు తటస్థ వేదికపై జరగాల్సి ఉంది. ఈ టోర్నీ కోసం సెప్టెంబర్‌లో 19 రోజుల విండో కేటాయించారు. ఆసియా కప్‌లో ఇండియా–పాక్ కనీసం రెండు సార్లు, ఫైనల్లోనూ తలపడే చాన్సుంది. అయితే, అద్భుతం జరిగితే తప్ప ప్రస్తుత పరిస్థితుల్లో ఆసియా కప్ షెడ్యూల్ ప్రకారం జరిగే అవకాశం కనిపించడం లేదు.
►ALSO READ | Virat Kohli: ఆ ఒక్క ఘనత అందుకుంటేనే లెజెండ్: టెస్ట్ రిటైర్మెంట్ ప్రకటిస్తే కోహ్లీ దిగ్గజానికి అర్హుడు కాదా..?
సెప్టెంబర్ రెండో వారం నుంచి నాలుగో వారం వరకు ఐపీఎల్ నిర్వహణకు అనుకూలమైన విండోగా కనిపిస్తోంది. ఈ సమయంలో బీసీసీఐ వివిధ క్రికెట్ బోర్డులతో చర్చలు జరిపి, ఆటగాళ్లను ఐపీఎల్ కోసం తిరిగి రప్పించొచ్చు. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 22 వరకు విండీస్‌లో సీపీఎల్ జరగనుంది. ఇందులో వెస్టిండీస్ టాప్ ఆటగాళ్లు పాల్గొంటారు. అయితే సెప్టెంబర్ రెండో వారంలో చాలా మంది కరీబియన్ ఆటగాళ్లు ఐపీఎల్ జట్ల కోసం అందుబాటులోకి రావొచ్చు.
🚨 IPL 2025 RESUMPTION. 🚨
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 10, 2025
- The BCCI has shortlisted Bengaluru, Chennai and Hyderabad as the 3 venues to host the remaining 16 matches of IPL 2025. (Espncricinfo). pic.twitter.com/NtVyUIlXXn