T20 World Cup: పీకల్లోతూ కష్టాల్లో భారత్: 10 ఓవర్లలోపే 5 వికెట్లు

T20 World Cup: పీకల్లోతూ కష్టాల్లో భారత్: 10 ఓవర్లలోపే 5 వికెట్లు

గాంధీ నగర్: టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతోన్న మ్యాచులో భారత పీకల్లోతూ కష్టాల్లో పడింది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా 10 ఓవర్లలోపే 5 కీలక వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. ఫస్ట్ టెన్ ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది. శివమ్ దూబే (4), హార్దిక్ పాండ్యా క(3) క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచులో ఇండియా గెలవాలంటే 10 ఓవర్లలో 133 రన్స్ చేయాలి. 

ఈ మెగా టోర్నీలో భీకర ఫామ్‎లో ఉన్న ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్లలోనే డకౌట్ అయ్యాడు. మార్క్రమ్ బౌలింగ్‎లో క్యాచ్ ఔటై తీవ్ర నిరాశతో పెవిలియన్ బాటపట్టాడు. 
ఈ షాక్ నుంచి తేరుకోకముందే రెండో ఓవర్లో ఇండియాకు మార్కో యాన్సెన్ మరో ఝలక్ ఇచ్చాడు. 

తెలుగు క్రికెటర్ తిలక్ వర్మను (1) ఔట్ చేశాడు. ఒక ఫోర్, సిక్స్ కొట్టి టచ్‎లోకి వచ్చిన అభిషేక్ (15) ఆ వెంటనే క్యాచ్ ఔట్ అయ్యాడు. వాషింగ్టన్ సుందర్ కూడా 11 పరుగులే చేసి పెవిలియన్ బాట పట్టాడు. కాసేపు పోరాడిన సూర్య (18) వైడ్ వెళ్తున్న బంతిని వెంటాడి పెవిలియన్ చేరాడు. 

ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా భారీ స్కోర్ చేసింది. అహ్మదాబాద్‎లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచులో  డేవిడ్ మిల్లర్ (63) మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగగా.. డేవాల్డ్ బ్రేవిస్ (45) రాణించాడు. 

దీంతో సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు తీయగా.. అర్షదీప్ రెండు వికెట్లు పడగొట్టాడు. శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ తీశారు. అనంతరం 188 పరుగుల లక్ష్యంతో భారత్ ఛేజింగ్ మొదలు పెట్టింది.