RCFLలో 94 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు.. ఇంజినీరింగ్, డిగ్రీ చేసిన వారికి గుడ్ న్యూస్..

 RCFLలో 94 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు.. ఇంజినీరింగ్, డిగ్రీ చేసిన వారికి గుడ్ న్యూస్..

కేంద్ర ప్రభుత్వం రంగ సంస్థ, నవరత్న కంపెనీ అయిన రాష్ట్రీయ కెమికల్స్ అండ్ పర్టిలైజర్స్ లిమిటెడ్ (RCFL) దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో మేనేజ్మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిపికేషన్ విడుదల చేసింది. ఆసక్తి. అర్హతగల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లయ్  చేయవచ్చు. అప్లికేషన్  ప్రక్రియ ఆగస్టు 8న ప్రారంభం కాగా ఆగస్టు 24న ముగుస్తుంది.

పోస్టు పేరు: మేనేజ్మెంట్ ట్రైనీ.

మొత్తం ఖాళీలు: 94

విభాగాల వారీగా ఖాళీలు: కెమికల్ 32, బాయిలర్ 6, మెకానికల్ 4, ఎలక్ట్రికల్ 10, ఇనుస్ట్రుమెంటేషన్ 9, మెటీరియల్స్ 1, సివిల్ 1, ఫైర్ 1, సీసీ ల్యాబ్ 1, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ 2, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 5, రాజ్యభాష 2, ఫైనాన్స్ 10, మార్కెటింగ్ 10, ఎలిజిబిలిటీ గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఏదైనా విభాగంలో బీఈ / బి.టెక్ పూర్తిచేసి ఉండాలి. జనరల్ అభ్యర్థులు 60 శాతం, ఎస్సీ, ఎస్టీలు 55 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.

సీసీ ల్యాబ్: సంబంధిత ఇంజనీరింగ్ విభాగాలైన కెమికల్ ఇంజీనీరింగ్, పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ లేదా కెమికల్ టెక్నాలజీ కోర్సుల్లో బీఈ / బి.టెక్ పూర్తిచేసి ఉండాలి. కెమిస్ట్రీలో పీహెచ్డీ పూర్తిచేసిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.

రాజ్యభాష: ఇంగ్లీష్ ఒక కంపల్సరీ / ఎలెక్టిన్ సబ్జెక్టు గా లేదా పరీక్షా మాధ్యమంగా అభ్యసించి హిందీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
(లేదా)   హిందీ ఒక కంపల్సరీ ఎలెక్టివ్ సబ్జెక్ట్ గా అభ్యసించి ఇంగ్లీష్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి (లేదా) హిందీ, ఇంగ్లీష్ కాంబినేషన్ ఏదైనా ఇతర సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. 

ఫైనాన్స్: చార్టెర్డ్ అకౌంటెంట్ (సీఏ) లేదా కాస్ట్ అంద్ మేనేజ్ మెంట్ అకౌంటెంట్ (సీఎంఏ) పూర్తి చేసి ఉండాలి.
(లేదా)  
కామర్స్ లేదా అబౌంటింగ్ లేదా ఫైనాన్స్ విభాగంలో ఫుల్ టైమ్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి, ఫైనాన్స్, స్పెషలైజెషన్ తో రెండేళ్ల ఫుల్ టైమ్ ఎంబీఏ/ ఎంఎంఎస్/పీజీడీఎం పూర్తిచేసి ఉండాలి.

మార్కెటింగ్: సైన్స్ లేదా ఇంజినీరింగ్ లేదా అగ్రికల్చర్ విభాగంలో ఫుల్ టైం  గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దీంతోపాటు మార్కెటింగ్ లేదా అగ్రిబిజినెస్ మేనేజ్మెంట్/ అగ్రికల్చర్ విభాగంలో స్పెషలైజెషన్ తో రెండేళ్ల ఫుల్ టైమ్ ఎంబీఏ/ ఎంఎంఎస్/ సీజీడీఎం పూర్తిచేసి ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 27 ఏళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్: ఆన్ లైన్ ద్వారా.

అప్లికేషన్ ఫీజు: జనరల్/ఓబీసీ ఈడబ్ల్యూఎస్ఆభ్యర్థులకు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూబీడీ మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

అప్లికేషన్ ప్రారంభం: ఆగస్టు 3.

లాస్ట్ డేట్: జగష్టు 24

సెలెక్షన్ ప్రాసిస్: ఆన్ లైన్  టెస్ట్ (80శాతం) పర్శనల్ ఇంటర్వ్యూ (20) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

మరిన్ని వివరాలకు వెబ్ సైట్  www.refited.comను సందర్శించండి.

ఎగ్జామ్ ప్యాటర్న్
ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించే రాత పరీక్షలో ప్రశ్నలు మల్టీపుల్ వాయిస్ రూపంలో ఇస్తారు. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. 150 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 90 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు అభ్యసించిన నిర్దిష్ట కోర్సు డిగ్రీ కరిక్యులమ్ నుంచి 50 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు, మొత్తం 100 మార్కులు. జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్.. రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అవేర్వెస్ నుంచి 50 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు, మొత్తం 50 మార్కులు, నెగటివ్ మార్కింగ్ విధానం ఉంది. పరీక్ష హిందీ, ఇంగ్లీష్ భాషల్లో నిర్వహిస్తారు.

పరీక్ష కేంద్రాలు: భోపాల్, స్యూఢిల్లీ, లక్నో, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, గౌహతి, కోల్కతా, ముంబై/ నవీ ముంబై/థానే ఎంఎంఆర్ ప్రాంతం, నాగ్ పూర్.

ఇంటర్వ్యూ: ఆన్ లైన్ రాత పరీక్షలో ప్రతిభ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఒక్కో పోస్టుకు 1:7 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. ఇంటర్యూలో అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులు  సాధించాల్సి ఉంటుంది.