ఆర్మీ డెంటల్ కార్ప్స్ సివిలియన్ డెంటల్ సర్జన్ల కోసం షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో 37 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 22న ప్రారంభం కాగా అక్టోబర్ 22 వరకు అప్లై చేసుకోవచ్చు.
ఎంట్రీ: ఆర్మీ డెంటల్ కార్ఫ్స్, 2026 షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్‌సీ).
మొత్తం పోస్టులు: 37.
ఉద్యోగ హోదా: కెప్టెన్ (షార్ట్ సర్వీస్ కమిషన్డ్ ఆఫీసర్).
విద్యార్హతలు:
*గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 55 శాతం మార్కులతో బీడీఎస్ (ఫైనల్ ఇయర్) లేదా ఎండీఎస్ పూర్తిచేసి ఉండాలి. *డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం 2026, జూన్ 30 నాటికి ఏడాది కంపల్సరీ రోటరీ ఇంటర్న్‌షిప్‌ను పూర్తిచేసి ఉండాలి.
*నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (ఎన్బీఈ)నిర్వహించిన నీట్ (ఎండీఎస్)–-2026 పరీక్షకు హాజరై ఉండాలి.
*స్టేట్ డెంటల్ కౌన్సిల్ లేదా డీసీఐ వద్ద రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. ఇది 2026, డిసెంబర్ 31వరకు చెల్లుబాటులో ఉండాలి.
వయసు: 2026, డిసెంబర్ 31 నాటికి అభ్యర్థుల వయసు 45 ఏళ్లు మించకూడదు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆన్‌లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 22.
అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులు అందరూ రూ.200 చెల్లించాలి.
లాస్ట్ డేట్: అక్టోబర్ 22.
సెలెక్షన్ ప్రాసెస్: నీట్ (ఎండీఎస్) స్కోర్ ఆధారంగా ఇంటర్వ్యూకు షార్ట్‌లిస్ట్ చేస్తారు. అర్హత సాధించిన వారికి ఢిల్లీలోని ఆర్మీ డెంటల్ సెంటర్‌లో పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఆ తరువాత మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.join.afms.gov.inను సందర్శించండి.
సర్వీస్: ఆర్మీ డెంటల్ కార్ఫ్స్కు ఎంపికైన అభ్యర్థుల ఉద్యోగ కాలం ఐదేళ్లు ఉంటుంది. ఆసక్తి ఉండి, ఖాళీలు, అర్హతలు ఉన్నట్లయితే ఈ కాలాన్ని మరో 9 ఏళ్లు (మొదటి విడతగా ఐదేళ్లు, ఆ తర్వాత నాలుగేళ్లు) పొడిగించుకోవడానికి అవకాశం ఉంది. మొత్తం మీద ఎస్ఎస్‌సీ పదవీకాలం గరిష్టంగా 14 సంవత్సరాల వరకు కొనసాగవచ్చు.
ప్రొబేషన్: కమిషన్ స్వీకరించిన తేదీ నుంచి మొదటి 12 నెలలపాటు అభ్యర్థులు ప్రొబేషన్ కాలంలో ఉంటారు.
