తెలంగాణలోని హనుమకొండ జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేన్ ద్వారా భీమదేవరపల్లి, హనుమకొండ అర్బన్, పరకాల ఐసీడీఎస్ (ఐసీడీఎస్) ప్రాజెక్టుల పరిధిలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన స్థానిక మహిళా అభ్యర్థులు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 6 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.
పోస్టు పేరు: అంగన్‌వాడీ టీచర్.
మొత్తం ఖాళీలు: 55 (భీమదేవరపల్లి 23, హన్మకొండ అర్బన్ 19, పరకాల13).
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి లేదా ఇంటర్మీడియట్ పూర్తిచేసి ఉండాలి. స్థానిక మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవడానికి అర్హులు.
వయసు: 2026, జులై 1 నాటికి 18 నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు , ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 22.
లాస్ట్ డేట్: అక్టోబర్ 6.
సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంటర్మీడియట్ మార్కులకు 70 మార్కులు, విడో కేటగిరీకి 5 మార్కులు, అనాథ కేటగిరీకి 10 మార్కులు, పీడబ్ల్యూబీడీ కేటగిరీకి 5 మార్కులు, డీఎస్సీ నిర్వహించే ఇంటర్వ్యూకు 10 మార్కులు కేటాయించారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ mis.tgwdcw.inను సందర్శించండి.
