IND vs SA: భారత్ vs దక్షిణాఫ్రికా మధ్య హై వోల్టేజ్ మ్యాచ్.. కలవర పెడుతున్న పిచ్ రిపోర్ట్!

IND vs SA: భారత్ vs దక్షిణాఫ్రికా మధ్య హై వోల్టేజ్ మ్యాచ్.. కలవర పెడుతున్న పిచ్ రిపోర్ట్!

IND vs SA: టీ20 వరల్డ్ కప్‌లో సూపర్-8 దశను భారత్- దక్షిణాఫ్రికా హోరాహోరీ పోరుతో ప్రారంభించనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ టోర్నీలో రెండు జట్లు తమ నాలుగు మ్యాచ్‌లలో గెలిచి సూపర్–8లో చోటు దక్కించుకుంది. అదే జోరును సూపర్-8లో కూడా కొనసాగించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాయి.

బ్యాటింగ్ ఫట్– బౌలింగ్ హిట్: 
ఈ మ్యాచ్ కి ముందు ఇరు జట్ల కొన్ని సమస్యలతో ఇబ్బంది పడుతున్నాయి. ముఖ్యంగా భారత్ ఇప్పటివరకు టోర్నీలో తన పూర్తి స్థాయి ఆటను ప్రదర్శించలేదన్న భావన అభిమానుల్లో ఉంది. టోర్నమెంట్లో ఓపెనర్ అభిషేక్ శర్మపై భారీ అంచనాలతో దిగినప్పటికీ, ఈ పంజాబ్ బ్యాటర్ తీవ్రంగా నిరాశపరిచాడు. వరుసగా 3 మ్యాచ్‌ల్లో డకౌట్లు కావడంతో అతడిపై ఒత్తిడి బాగా పెరిగింది. ఆ ఒత్తిడిని తగ్గించుకోవడానికి సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్ ని ఉపయోగించుకోవాలని టీమ్ మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. మిడిల్ ఓవర్లలో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ ల స్ట్రైక్‌రేట్ కూడా ఆందోళన కలిగిస్తోంది. గత కొన్ని మ్యాచ్‌ల్లో వీరు జస్ట్ యాంకర్ పాత్ర మాత్రమే పోషించడంతో.. టీమిండియా రన్‌రేట్ తగ్గింది. బౌలింగ్ విభాగం మాత్రం అద్భుతంగా రాణిస్తోంది. ముఖ్యంగా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఇప్పటి వరకు 9 వికెట్లు తీసి ప్రత్యర్థులను ఇబ్బంది పెడుతున్నాడు.

జట్టులో నిలకడ లేదు: 
ఇక దక్షిణాఫ్రికా విషయానికి వస్తే, జట్టులో నిలకడలేమి ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. యంగ్ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ మంచి ఆరంభాలు ఇస్తున్నప్పటికీ, వాటిని పెద్ద స్కోర్లుగా మార్చడంలో విఫలమవుతున్నాడు. అతడి బ్యాటింగ్ పై జట్టు మేనేజ్‌మెంట్ పెద్దగా ఆందోళన చెందడం లేదు.. ఇటీవల ఓ ప్రత్యేక కన్సల్టెంట్ అతడిని ‘ఎక్స్-ఫ్యాక్టర్’గా అభివర్ణించడం విశేషం. బౌలింగ్ విభాగంలోనూ ఇంకా మెరుగుదలకు ఛాన్స్ ఉంది. గత మ్యాచ్‌లో యూఏఈపై రెస్ట్ తీసుకున్న స్టార్ పేసర్ కగిసో రబడా కూడా ఈ మ్యాచ్‌లో మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. 

►ALSO READ | IND vs PAK Semi-Final: హోలీ రోజునే భారత్–పాక్ సెమీఫైనల్?.. మ్యాచ్ ముంబైలో జరగడం లేదా..!

పిచ్ రిపోర్ట్: 
నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు, బౌలింగ్‌కు సమతుల్యంగా ఉంది. ఐపీఎల్‌లో కనిపించేంత బ్యాటింగ్ స్వర్గంలా కాకపోయినా, భారీ స్కోర్లు నమోదయ్యే ఛాన్స్ మాత్రం ఉంది. 190 పరుగుల వరకు స్కోరు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. రెండో ఇన్నింగ్స్‌లో డ్యూ ప్రభావం ఉండే ఛాన్స్ ఉండటంతో, టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ చేయడం బెటర్.. ప్రీ-మ్యాచ్ ప్రెస్‌మీట్‌లో సూర్యకుమార్ యాదవ్ “ఆధునిక టీ20 క్రికెట్‌లో టాస్ ఓవర్‌రేటెడ్ అంశం” అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.