- 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
రాష్ట్రంలో ఆదివారం నుంచి మూడ్రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సోమ, మంగళవారాల్లో 18 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆదివారం నుంచి మూడ్రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. సోమ, మంగళవారాల్లో 18 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అయితే, ఆదివారం మాత్రం అక్కడక్కడా చెదురుమదురు వర్షాలు పడతాయని తెలిపింది.
ఆ తర్వాత రెండ్రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. సోమవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మంగళవారం రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది.
