T20 World Cup: భారత్‎కు బిగ్ షాక్.. భీకర ఫామ్‎లో ఉన్న ఇషాన్ డకౌట్.. ఒక్క రన్‎కే తిలక్ ఔట్

T20 World Cup: భారత్‎కు బిగ్ షాక్.. భీకర ఫామ్‎లో ఉన్న ఇషాన్ డకౌట్.. ఒక్క రన్‎కే తిలక్ ఔట్

గాంధీ నగర్: టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతోన్న మ్యాచులో భారత్‎కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా రెండు ఓవర్లలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ మెగా టోర్నీలో భీకర ఫామ్‎లో ఉన్న ఇషాన్ కిషన్ డకౌట్ అయ్యాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే మార్క్రమ్ బౌలింగ్‎లో క్యాచ్ ఔటై తీవ్ర నిరాశతో పెవిలియన్ బాటపట్టాడు. 

ఈ షాక్ నుంచి తేరుకోకముందే రెండో ఓవర్లో ఇండియాకు మార్కో యాన్సెన్ మరో ఝలక్ ఇచ్చాడు. తెలుగు క్రికెటర్ తిలక్ వర్మను (1) ఔట్ చేశాడు. దీంతో ఇండియా రెండు ఓవర్లలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయి ఒత్తిడిలోకి వెళ్లింది. ప్రస్తుతం అభిషేక్ (14), సూర్య (8) క్రీజులో ఉన్నారు. 

ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా భారీ స్కోర్ చేసింది. అహ్మదాబాద్‎లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచులో  డేవిడ్ మిల్లర్ (63) మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగగా.. డేవాల్డ్ బ్రేవిస్ (45) రాణించాడు. 

దీంతో సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు తీయగా.. అర్షదీప్ రెండు వికెట్లు పడగొట్టాడు. శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ తీశారు. అనంతరం 188 పరుగుల లక్ష్యంతో భారత్ ఛేజింగ్ మొదలు పెట్టింది.