గుడ్డుతో వెరైటీగాఇన్సెంట్ కర్రీ అంటే అందరికీ మొదట గుర్తొచ్చేది గుడ్డి. వంటల్లో ఓనమాలు తెలియని వాళ్ళు కూడా గుడ్డుతోనే ఎక్స్పరిమెంట్స్ స్టార్ట్ చేస్తారు.ఇక బ్యాచిలర్స్ అయితే ఆమ్లెట్ విత్ క్యాప్సికం.. గుడ్డు చట్నీ అంటూ సగం రోజులుగుడ్డుతోనే వెల్లదీస్తుంటారు. మరి అందరి ఫేవరెట్ ఎగ్ ని ఇంకాస్త స్పెషల్గావండుకుని తింటే.. వావ్ వింటుంటేనే నోట్లో నీళ్లూరుతున్నాయి కదా..మరి కోడిగుడ్డుతో నిల్వపచ్చడి .. క్యాప్సికం ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం...!
కోడిగుడ్డు పచ్చడి తయారీకి కావలసినవి
కోడిగుడ్లు (ఉడికించినవి)- రెండు డజన్లు
- కారం- అరకేజీ
- ఉప్పు- 400 గ్రాములు
- పసుపు, మెంతులు- ఒక్కోటి నాలుగు టీ స్పూన్లు
- ఎండుమిర్చి-- పది
- చింతపండు- అరకేజి
- నూనె- అరకేజీ
కోడిగుడ్డు పచ్చడి తయారీ విధానం
మెంతుల్ని వేగించి పొడి చేయాలి. పాన్ లో సరిపడా నూనె వేడి చేసి కోడిగుడ్లను ఉడికించాలి. చింతపండులో సరిపడా నీళ్లపోసి మరిగించి గుజ్జు రెడీ చేయాలి. ఓ గిన్నెలో కారం, ఉప్పు, చింతపండు గుజ్జు, మెంతిపిండి, నూనె తీసుకుని బాగా కలపాలి. ఇప్పుడు వేగించి పెట్టుకున్న కోడిగుడ్లు వేసి మరోసారి కలపాలి. మిగిలిన నూనె వేడిచేసి. ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్రతో తాలింపు పెట్టి.. పచ్చడిపై వేసి బాగా కలపాలి.
క్యాప్సికం ఆమ్లెట్ తయారీకి కావలసినవి
- క్యాప్సికం–ఒకటి
- టొమాటో తరుగు-- రెండు టీ స్పూన్లు
- ఉల్లిగడ్డ తరుగు- ఒక టేబుల్.
- కోడిగుడ్లు- రెండు
- ధనియాల పొడి- ఒక టీ
- వైట్ పెప్పర్- అర టీ స్పూన్
- కారం- అర టీ స్పూన్
- పసుపు- చిటికెడు
- ఉప్పు- రుచికి సరిపడా
- నూనె- ఒక టేబుల్ స్పూన్
క్యాప్సికం ఆమ్లెట్ తయారీ విధానం
క్యాప్సికంలో ఒక సగాన్ని చిన్న చిన్న ముక్కలుగా .. మిగిలిన సగాన్ని పొడవుగా తరగాలి.ఇప్పుడు ఒక కప్పులో ఉల్లిగడ్డ తరుగు చిన్నగా తరిగిన క్యాప్సికం, టొమాటో ముక్కలు, వైట్ పెప్పర్, ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు వేసి కలపాలి. పొడులన్నీ ముక్కలకు సమంగా పట్టిన తర్వాత కోడిగుడ్డు సొన చేసి నురగ వచ్చే వరకు బీట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని కాగే నూనెలో వేసి మీడియం ఫ్రేమ్ లో కాలనివ్వాలి. రెండు వైపులా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పొడవుగా తరిగి క్యాప్సికంతో గార్నిష్ చేయాలి
